Adilabad | అంగన్వాడీల.. కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
Adilabad | అడ్డుకున్న పోలీసులు తోపులాట.. నిరసనకారుల అరెస్టు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: అంగన్వాడీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కనీస వేతనం రూ.25 వేలు చెల్లించాలంటూ అదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయం లోపలికి నిరసనకారులు చొచ్చుకుపోయారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా వచ్చిన సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్ కు తరలిస్తుండగా, […]

Adilabad |
- అడ్డుకున్న పోలీసులు
- తోపులాట.. నిరసనకారుల అరెస్టు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: అంగన్వాడీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కనీస వేతనం రూ.25 వేలు చెల్లించాలంటూ అదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయం లోపలికి నిరసనకారులు చొచ్చుకుపోయారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా వచ్చిన సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్ కు తరలిస్తుండగా, అంగన్వాడీ టీచర్లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అంగన్వాడీ టీచర్లకు తోపులాట జరిగింది.
ఆందోళనకారులు మహిళా ఎస్సైని నెట్టివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. కొంత సేపు కలెక్టరేట్ ఆవరణం రణరంగాన్ని తలపించింది.ఎట్టకేలకు సీఐటీయూ నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.