ఏపీలో ముందస్తు.. తథాస్తు..!
TDP సర్దుకునేలోపు కొట్టేయాలి జగన్ ప్లాన్ సిద్ధం!! విధాత: వైరి పక్షం అస్త్ర శస్త్రాలు సర్దుకునేలోపు దాడి చేయాలి.. నిద్రలో ఉన్న వాళ్లు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి పోవాలి.. వాళ్ళు కోలుకునేలోపు పోరు ముగిసి పోవాలీ.. ఇదీ యుద్ధ తీరు.. ఎన్నికల్లో అయినా యుద్ధంలో అయినా రాజకీయ పక్షాల ఎత్తుగడలు ఇలాగే ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారా.. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు […]

- TDP సర్దుకునేలోపు కొట్టేయాలి
- జగన్ ప్లాన్ సిద్ధం!!
విధాత: వైరి పక్షం అస్త్ర శస్త్రాలు సర్దుకునేలోపు దాడి చేయాలి.. నిద్రలో ఉన్న వాళ్లు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి పోవాలి.. వాళ్ళు కోలుకునేలోపు పోరు ముగిసి పోవాలీ.. ఇదీ యుద్ధ తీరు.. ఎన్నికల్లో అయినా యుద్ధంలో అయినా రాజకీయ పక్షాల ఎత్తుగడలు ఇలాగే ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారా.. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి.
చూస్తుంటే జగన్ కూడా అటు టీడీపీని కుదురుకునే లోపు మళ్ళీ చావు దెబ్బ కొట్టేందుకే సన్నద్ధం అవుతున్నట్లు తెలిస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో రాజకేయ పరిస్థితి జగన్‌కు కాస్త ఇబ్బందికరంగా మారింది. అప్పులు చేసి మరీ లక్షల కోట్లు తెచ్చి జనాలకు పంచుతున్నా చివరకు జగన్ పట్ల సానుకూలత కాస్త తగ్గినట్లు సర్వేల్లో తేలింది. అభివృద్ధి ఎక్కడా కానరావడం లేదన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తం అవుతోంది.
ఒక్క చాన్స్ అని ఇస్తే ఇలా వ్యవస్థలను నాశనం చేస్తున్నారన్న అభిప్రాయం యువత, ఉద్యోగులు, విద్యావంతుల్లో వ్యక్తం అవుతోంది. దీనికితోడు అటు చంద్రబాబు సభలకు జనం భారీగా వస్తుండడం. మెల్లగా జనసేన సైతం బలపడుతుందడడం ఇవన్నీ జగన్‌కు తలనొప్పిగా మారింది. పథకాలు పంచడం మినహా ఏమీ చేయడం లేదన్నా విమర్శలూ గట్టిగానే ఉన్నాయి. పోనీ రాజధాని అయినా విశాఖ తీసుకొచ్చారా అంటే అదీ లేదు. ఇలాంటప్పుడు ఏమి చూపించి మళ్ళీ ఓట్లకు వెళతారన్న ప్రశ్న వినిపిస్తోంది.
దీంతో అటు టీడీపీ ఇంకా జనంలోకి పూర్తిగా వెళ్ళక ముందు, జనసేన, టీడీపీల పొత్తు ఇంకా కుదరక ముందు.. వారి మిత్రుత్వం ఇంకా పూర్తిస్థాయిలో ముదరక ముందే ఎన్నికలకు పోవాలని, ఇంకా జాగు చేస్తే వ్యతిరేకత మరింత పెరిగితే ఇంకా కష్టం అవుతుందని జగన్ భావిస్తున్నట్లు “విధాత”కు విశ్వసనీయ సమాచారం ఉంది. దీంతో రానున్న అసెంబ్లీ బడ్జట్ సమావేశాల అనంతరం అసెంబ్లీని రద్దు చేసేసి ఆగస్ట్..సెప్టెంబర్ నెలల్లో ఎన్నికలకు వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే గడపగడపకు మీ ప్రభుత్వం పేరిట మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలను ప్రతి ఇంటికి పంపిన జగన్ ఒక విడత ప్రచారం పూర్తి చేసినట్టే లెక్క. ఇది కాకుండా ప్రతి యాభై కుటుంబాలకు ఇద్దరు చొప్పున గ్రామ సారథులను నియమించి ఓట్లను.. ఓటర్లను సమీకరించే పనులు కూడా మొదలు పెట్టేశారు. ఇంకా తెలుగుదేశం.. జనసేన మధ్య పొత్తు సంగతి తేలనే లేదు.. ఏఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలన్న పంపకాలు జరగలేదు.. వాళ్ళింకా ఆ సర్దుబాట్లలోనే ఉన్న టైములో తాను మాత్రం సర్వం సన్నద్ధంగా కూర్చున్న జగన్ ఏక్షణమైనా ఎన్నికల బరిలోకి దూకడానికి సర్వం సిద్ధంగా ఉన్నారు.
కాంప్లికేటెడ్ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మారుస్తూ.. అవసరమైన చోట కొత్తవారికి అవకాశం ఇస్తూ ఒక్కో అడుగు ఎన్నికల బూత్ వైపు వేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ ఇదే విషయాన్ని ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా వంటివారితో చర్చించి ముందస్తు అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. వారు గో ఎహెడ్ అన్న తరువాత నుంచి అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం వంటి పనులు ముమ్మరం చేశారు.
మరోవైపు రోడ్ షోలు.. బహిరంగ సభల మీద నిషేధం కూడా విధిస్తూ టీడీపీని ముప్పుతిప్పలు పెడుతూనే తమ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మాత్రం యధావిధిగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఆర్థిక వనరులు..ఇతరత్రా సరంజామా ఇప్పటికే సిద్ధం అయిపోయిందని, ఇక ఎన్నికల నగారా మోగించడమే మిగిలిందని అంటున్నారు. నిన్నామోన్నా గ్రామాల్లో పెన్షన్స్ మొత్తాన్ని పెంచుతూ..ఆ డబ్బును ప్రజలకు అందిస్తూ మంత్రులు..నాయకులు సైతం మళ్ళీ తమకే మద్దతు పలకాలని ప్రజలను కోరారు.
పీకే టీమ్ బిజీ!
ఇదిలా ఉండగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన టీములు ఇప్పటికే జిల్లాల్లో తిరుగుతూ ఒక్కో ఎమ్మెల్యే మీద సర్వేలు.. ప్రజలు.. కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాయి. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల్సి వస్తే ఇంకెవరికీ టికెట్ ఇస్తే బావుంటుందన్నది సైతం పీకే టీమ్ అభిప్రాయాలు తీసుకుంటోంది. దీనికితోడు జగన్ సొంత సర్వే బృందాలు.. ప్రభుత్వ ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సైతం వడివడిగా సమాచారం తాడేపల్లి జగన్ క్యాంప్ ఆఫీసుకు చేరుతోంది. ప్రతి నియోజక వర్గాన్ని కీలకంగా భావిస్తూ వస్తున్న జగన్ ఎత్తులు..పై ఎత్తులు.. వ్యూహాలతో రెడీ అవుతున్నారు. మొన్న నర్సీపట్నం సభకు భారీగా జనం రావడాన్ని వైసీపీ శుభసూచకంగా భావిస్తోంది. మొత్తానికి జగన్ అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నారని త్వరలోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల శంఖారావం పూరిస్తారని అంటున్నారు.
కారణం ఏమని చెబుతారు?
ఐదేళ్ల పాలనకు ప్రజలు తీర్పు ఇస్తే ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారన్నదానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం ఉందొ తెలియడం లేదు.వాస్తవానికి ఏపీ అసెంబ్లీకి 2024 ఏప్రిల్ వరకూ సమయం ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తడం.. రాజకీయ సంక్షోభం రేకెత్తడం వంటి ఘటనలు జరిగితే తప్ప అసెంబ్లీని రద్దు చేయడం కుదరదు. అంటే సహేతుకమైన కారణం ఉంటేనే దాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి మళ్ళీ ఓట్లు అడుగుతారు.
2003లో చంద్రబాబు సైతం ఇలాగే ఆర్నెల్లు ముందుగా అసెంబ్లీని రద్దు చేశారు. అలిపిరిలో తన మీద మావోయిష్టుల దాడి చేయడంతో గాయపడ్డారు.ఆ ఆ సానుభూతితో మళ్ళీ గెలిచేస్తాం అనే ఆశతో ఆశ్రమబ్లీని ముందే రద్దు చేసేసి ఎన్నికలకు వెళ్లినా వైఎస్సార్ ప్రభ ముందు నిలవలేక పోయారు.మరి ఇప్పుడు జగన్ ఏ కారణం చూపి అసెంబ్లీని రద్దు చేస్తారు.. ప్రజలకు ఏమని సమాధానం చెబుతారన్నది ఎవరికి తెలియడం లేదు.. చూడాలి.. జగన్ మనసులో ఏముందో మరి.!