REVANTH REDDY | అధికారంలోకి వచ్చాక.. 6 నెలల్లో గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం: రేవంత్ రెడ్డి
REVANTH REDDY, Gandipally Project, MEDAK, HUSNABAD, REVANTH REDDY గండిపల్లికి ఒక న్యాయం, సొంత ప్రాజెక్టుల ఒక న్యాయామా ఈ ప్రాజెక్టు ప్రారంభించింది కాంగ్రెస్.. పూర్తి చేసేదీ కాంగ్రెస్సే సీఎం కేసీఆర్ పదవి విరమణ, రాజకీయ విరమణచేశారు పీసీసీ ఛీఫ్ అనుముల రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరుకున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు (Gandipally Project) ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని […]

REVANTH REDDY, Gandipally Project, MEDAK, HUSNABAD, REVANTH REDDY
- గండిపల్లికి ఒక న్యాయం, సొంత ప్రాజెక్టుల ఒక న్యాయామా
- ఈ ప్రాజెక్టు ప్రారంభించింది కాంగ్రెస్.. పూర్తి చేసేదీ కాంగ్రెస్సే
- సీఎం కేసీఆర్ పదవి విరమణ, రాజకీయ విరమణచేశారు
- పీసీసీ ఛీఫ్ అనుముల రేవంత్‌రెడ్డి
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరుకున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు (Gandipally Project) ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులను స్వయంగా సందర్శించిన సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేశాడని మండిపడ్డారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, పూర్తి చేసేది కూడా తమ పార్టీనే అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ పదవీ విరమణ, రాజకీయ విరమణ చెప్పారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు బై బై చెప్పి, కాంగ్రెస్ కు స్వాగతం చెప్పాలని ప్రజలకు కోరుతున్నట్లు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గండిపల్లి ప్రాజెక్టును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సందర్శించారు.
కేసీఆర్.. ఫార్మ్ హౌస్లోనే శేషజీవితం గడపాలి
కేసీఆర్ స్వతహాగా ముసలోడిని అయ్యానని చెబుతున్నారు కాబట్టి తమ నినాదం బై బై కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్లోనే శేషజీవితం గడపాలని సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారని విమర్శించారు. అందుకే పబ్లిక్ మీటింగులలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కామెంట్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 70శాతం పూర్తి అయిన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.
ప్యాకేజీలు ఇవ్వకుండా నిర్వాసితుల గోసకు కారణం అవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు (Gandipally Project) ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులను స్వయంగా సందర్శించిన కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేశారని విమర్శలు చేశారు.
ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, పూర్తి చేసేది కూడా తమ పార్టీనే అని చెప్పారు రేవంత్. కాంగ్రెస్ హయాంలో 70 శాతం పూర్తి అయిన ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్యాకేజ్ లు ఇవ్వకుండా నిర్వాసితుల గోసకు కారణం అయ్యారని మండిపడ్డారు. పరిహారం అడిగితే నిర్వాసితులను జైలుకు పంపుతున్నారని ఫైరయ్యారు.
కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయన మార్గ మధ్యలో ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. విమర్శలు గుప్పించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో వివరించారు.సంపూర్ణ మార్పు కోసమే యాత్ర చేపట్టామన్నారు.
మల్లన్న సాగర్‌కి ఓ న్యాయం గండిపల్లికి ఓ న్యాయమా?
స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని రేవంత్‌రెడ్డి పేర్కొ న్నారు. మల్లన్న సాగర్‌కి ఒక న్యాయం గండిపల్లికి ఒక న్యాయమా? ఆయన సొంత ప్రాంతం ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని , కేసీఆర్ ఈ ప్రాజెక్టులను స్వయంగా సందర్శించిన సీఎం కేసీఆర్ (CM KCR) సామర్థ్యం పెంచుత అని చెప్పిండని కానీ కుర్చీ వేసుకొని గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేశాడని ఎద్దెవా చేశారు.
ఈ ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ.. పూర్తి చేసేది కాంగ్రెస్ పార్టీ నే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పదవి విరమణ రాజకీయ విరమణ చెప్పిన కేసీఆర్ వల్ల పూర్తికాని గండిపల్లి ప్రాజెక్ట్ (Gandipally Project) బీఆర్ఎస్ (BRS) పూర్తి చేస్తుందనే నమ్మకం లేదన్నారు. రాజకీయ విరమణ అని ప్రకటించిన కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు కలగాలి, వారి శేషజీవితం ప్రశాంతంగా గడవాలని కోరుకుంటున్నానని, కేసీఆర్ బై బై చెప్పి కాంగ్రెస్‌కు స్వాగతం చెప్పాలని ప్రజలను రేవంత్‌రెడ్డి కోరారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ,కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం కట్కురు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. హుస్నాబాద్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.