సాయుధ పోరాటాన్ని నడిపిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ: ఎమ్మెల్యే కూసుకుంట్ల
విధాత: తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ప్రజా యుద్ధ నౌక గద్దర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డిలు అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కళాకారులు తమ ఆటలు, పాటలతో అలరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం […]

విధాత: తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ప్రజా యుద్ధ నౌక గద్దర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డిలు అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కళాకారులు తమ ఆటలు, పాటలతో అలరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నడిపిన ఘన చరిత్ర చాకలి ఐలమ్మదన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇక్కడి ప్రజల చైతన్యానికి నిదర్శనం అన్నారు.
నాడు భూస్వాములు పెత్తందారులు నిజాం నిరంకుశ పాలన తో విసిగి చెందిన ప్రజలను చాకలి ఐలమ్మ నాయకత్వంలో సాయిధ దళాలుగా ఏర్పడి పోరాడినట్లు తెలిపారు. ఆమె పోరాటానికి మద్దతుగా పేదలు, కూలీలు ,రైతులు ,బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏకమై పోరాడినట్లు తెలిపారు.
ఆమె చూపిన తెగువ పోరాట పటిమ వల్లనే వేలాదిమంది ప్రజలు తిరుగుబాటు చేశారని వివరించారు. ఆమె చేసిన తిరుగుబాటు ఫలితంగానే లక్షలాది ఎకరాల భూములను పేదలు దక్కించుకున్నారని తెలిపారు. ఆమె చేసిన త్యాగం, స్ఫూర్తి వల్లనే నేటి తెలంగాణ ఉద్యమం నడిపినట్లు తెలిపారు. నేటి యువత ఆమె ఆశయాలను, ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డి, జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేశం, సర్వేలు గ్రామ సర్పంచ్ కట్టెల బిక్షపతి, ఎంపీటీసీ ఈసం యాదయ్య, నల్పరాజు రమేష్, కత్తుల లక్ష్మయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ పగిళ్ల లక్ష్మయ్య, పగిళ్ల బిక్షపతి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.