Air India | ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి బీభత్సం..!
Air India | ఇటీవల విమానాల్లో అసభ్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలోనూ ఓ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. ఆ తర్వాత విమానాన్ని ఢిల్లీకి మళ్లించి.. సదరు ప్రయాణికుడు భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత విమానం మళ్లీ హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరింది. వివరాల్లోకి వెళితే.. దాదాపు 225 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడు విమానంలో […]

Air India | ఇటీవల విమానాల్లో అసభ్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలోనూ ఓ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. ఆ తర్వాత విమానాన్ని ఢిల్లీకి మళ్లించి.. సదరు ప్రయాణికుడు భద్రతా సిబ్బందికి అప్పగించారు.
ఆ తర్వాత విమానం మళ్లీ హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరింది. వివరాల్లోకి వెళితే.. దాదాపు 225 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడు విమానంలో రచ్చ చేశాడు. క్యాబిన్ సిబ్బందితో గొడవకు దిగారు. ఇందులో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.
సిబ్బంది హెచ్చరికలు జారీ చేసినా, వారించినా వినకపోవడంతో చివరకు విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత సదరు ప్రయాణికుడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ విషయాన్ని ఎయిర్ ఎండియా ధ్రువీకరించింది.