నేడు అక్కన్నపేట-మెదక్ మధ్య తొలి రైలు ప్రారంభం
విధాత: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కన్నపేట-మెదక్ మధ్య తొలి రైలును ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. 2012-13 రైల్వే బడ్జెట్‌లో అక్కన్నపేట- మెదక్ రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2014లో రైల్వే పనులకు శంకుస్థాపన చేశారు. 2015లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 206 కోట్ల రూపాయలతో ఈ రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. కాస్ట్ షేరింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించింది. సాయంత్రం మెదక్ నుంచి […]

విధాత: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కన్నపేట-మెదక్ మధ్య తొలి రైలును ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. 2012-13 రైల్వే బడ్జెట్‌లో అక్కన్నపేట- మెదక్ రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.
2014లో రైల్వే పనులకు శంకుస్థాపన చేశారు. 2015లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 206 కోట్ల రూపాయలతో ఈ రైల్వే లైన్ నిర్మాణం జరిగింది.
కాస్ట్ షేరింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించింది. సాయంత్రం మెదక్ నుంచి కాచిగూడకు తొలి రైలు బయలుదేరనున్నది. 17.2 కిలోమీటర్ల రైల్వే లైను ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ రైలు వారంలో అన్ని రోజులు నడవనున్నది.
మెదక్, శమ్నాపూర్, లక్ష్మాపూర్‌లలో రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేశారు. 17.2 కి.మీ. ట్రాక్ లో 40 పైగా వంతెనలు, రెండు ఆర్వోబీలను నిర్మించారు. 17 రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.