Akkineni Akhil Wedding: అక్కినేని అఖిల్..జైనబ్ పెళ్లి వేడుక

విధాత, హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, అమల కుమారుడు హీరో అఖిల్, జైనబ్ ల పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. జూబ్లీహిల్స్ లోని నాగార్జున అక్కినేని హౌస్ లో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల మధ్య జరిగిన పెళ్లి వేడుక శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు సాంప్రదాయబద్ధంగా సాగింది. అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీల వివాహా వేడుకకు చిరంజీవి కుటుంబం, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు శర్వానంద్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అఖిల్ తన ప్రియురాలు జైనబ్ తో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన పెళ్లి వేడుక ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఢిల్లీకి చెందిన జైనబ్ రవ్జీ థియేటర్ ఆర్టిస్టుగా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా గుర్తింపు పొందారు. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జున కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం జైనబ్, అఖిల్ ల మధ్య మొదైన పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటల వరకు సాగింది. అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్లు పెద్దది. ఆదివారం జరిగే అఖిల్, జైనబ్ ల రిసెప్షన్ ను అక్కినేని ఫ్యామిలీ భారీ స్థాయిలో నిర్వహించనుంది.
#AkhilZainab pic.twitter.com/eWCwF55Og4
— Gulte (@GulteOfficial) June 6, 2025