‘అలా వైకుంఠపురం’ హిందీ రిమేక్..‘షెహజాదా’ పాటలు గోవిందా!
తమన్ సంగీతాన్ని అందుకోలేక పోయిన ప్రీతం! విధాత: తెలుగులో సంగీత దర్శకుడు తమన్ అందించిన అద్భుతమైన పాటల ఆల్బమ్ అంటే వెంటనే ఎవరైనా అలా వైకుంఠపురంలో అని చెబుతారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అలా వైకుంఠపురంలో చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ చిత్రం హిట్ కావడంలో తమన్ సంగీతం కూడా ఎంతో ప్లస్ అయింది. చాలా కాలంగా కాపీ క్యాట్ […]

తమన్ సంగీతాన్ని అందుకోలేక పోయిన ప్రీతం!
విధాత: తెలుగులో సంగీత దర్శకుడు తమన్ అందించిన అద్భుతమైన పాటల ఆల్బమ్ అంటే వెంటనే ఎవరైనా అలా వైకుంఠపురంలో అని చెబుతారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అలా వైకుంఠపురంలో చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు.
ఈ చిత్రం హిట్ కావడంలో తమన్ సంగీతం కూడా ఎంతో ప్లస్ అయింది. చాలా కాలంగా కాపీ క్యాట్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఆయన అలా వైకుంఠపురం చిత్రాన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టరజ్గా నిలిపి విమర్శకుల నోళ్లు మూయించారు. తొలిసారి తన క్రియేటివిటీ అంతా చూపించి త్రివిక్రమ్ మార్గ నిర్దేశంలో అద్బుతమైన ట్యూన్స్‌తో పాటలను అందించారు.
ఇక ఈ చిత్రంలోని రాములో రాముల సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇందులో ప్రతి పాటా దేనికదే వైవిధ్యం. అల్లుఅర్జున్ స్టెప్పులు, పొడుగు కాళ్ల సుందరి బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఎలివేషన్ ప్రతిపాటకు కొత్త కలర్ తెచ్చాయి. అన్నింటిలోనూ రాములో రాముల క్లాస్‌గా నిలిచింది. అల్లు అర్జున్, పూజ హెగ్డే రొమాన్స్ సింపుల్ డాన్స్‌లు ఎంతో కళాత్మకం.
అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా షెహజాదా టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలవగా దాదాపు అన్ని సీన్లు అలా వైకుంఠపురంలోని సీన్లను రీక్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక్కడ తమన్‌కు ధీటుగా హిందీలో ప్రీతం సరైన సంగీతం అందించలేకపోయాడు. అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు. పాటల ట్యూన్లు, వాటి చిత్రీకరణ, రీమేక్ చేసిన పాటలు అన్ని జస్ట్ యావరేజ్ అని మాత్రమే అనిపిస్తున్నాయి.
అసలు క్లాసిక్‌ను టచ్ చేయడమే చాలా తప్పు. ఎంత గొప్ప ఎఫర్ట్ పెట్టినా ఒరిజినల్ తో పోలిస్తే చాలా ఇబ్బందులు, విమర్శలు వెలువెత్తుతాయి. అదే ఈ చిత్రం విషయంలో కూడా జరిగింది. రాములో రాముల పాట స్థానంలో ప్రీతం అందించిన ట్యూన్ ఏమాత్రం వినసొంపుగా లేదు.
అర్జిత్ సింగ్ గానం, ప్రీతం సంగీతం జస్ట్ ఓకే అనిపించాయి. పాట మేకింగ్ మాత్రం బాగుంది. కానీ బన్నీతో కార్తీక్ ఆర్యన్ డాన్స్ పోల్చలేం. అయితే హీరో పాత్రను కార్తీక్ ఆర్యన్ యధాతధంగా పోషించడానికి ప్రయత్నం చేయలేదు.
తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ డాన్సులతో మాత్రమే తెరపైకి వచ్చాడు. కథను ఉత్తరాది ఎమోషన్స్ తో మాత్రమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పూజా హెగ్డేతో పోలిస్తే కృతిసనన్ జస్ట్ యావరేజ్ అనిపిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.