అన్ని మతాలకు సమ ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
వైస్రాయ్ గార్డెన్ లో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ విధాత, మెదక్ బ్యూరో: ప్రతి పేదవాడు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టమస్ గిఫ్ట్ ప్యాక్ లు అందజేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణా ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాలు, వర్గాలను సమానంగా గౌరవిస్తూ పేదవాడు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ కొత్త బట్టలను అందజేస్తున్నదని అన్నారు. క్రిస్టమస్ పండుగ సందర్భంగా శుక్రవారం […]

- వైస్రాయ్ గార్డెన్ లో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ
విధాత, మెదక్ బ్యూరో: ప్రతి పేదవాడు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టమస్ గిఫ్ట్ ప్యాక్ లు అందజేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణా ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాలు, వర్గాలను సమానంగా గౌరవిస్తూ పేదవాడు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ కొత్త బట్టలను అందజేస్తున్నదని అన్నారు.
క్రిస్టమస్ పండుగ సందర్భంగా శుక్రవారం స్థానిక వైస్రాయ్ గార్డెన్ లో మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్టమస్ కానుకల పంపిణి కార్యక్రమంలో పాల్గొని క్రిష్టమస్ కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచమంతా శాంతియుతంగా, ప్రేమ పూర్వకంగా ఉండాలని, ప్రేమను అందరికి పంచాలని, త్యాగం, ప్రేమ గొప్పతనాన్ని, మనకు తెలిపిన త్యాగశీలి, దయామయుడు యేసు ప్రభువని అన్నారు.
జిల్లా వాసులు ఎంతో ప్రేమ మూర్తులని, అందరూ కలిసిమెలిసి జీవిస్తారని అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చితో పటు ఖిల్లా, ఏడుపాయలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేస్తున్నాయని అన్నారు. నూతనంగా మెదక్ జిల్లా ఏర్పడ్డ తరువాత పట్టణాన్ని అందమైన రోడ్లతో సుందరీకరించుకుంటున్నామని అన్నారు.
ఇటీవల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని రికార్డు స్థాయిలో 407 కాన్పులు చేశామని, అలాగే రైల్ సౌకర్యం వచ్చిందని, త్వరలో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కానుందని, సకల సౌకర్యాలతో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నామని తెలిపారు.
అక్కడక్కడా మిగిలిపోయిన అర్హులైన మరికొందరికి పింఛన్లు అందిస్తామని, స్వంత జాగా కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా వేయి మంది క్రైస్తవులకు క్రిస్టమస్ కానుకలు అందజేశారు. క్రైస్తవ సోదరుల విజ్ఞప్తి మేరకు స్మశాన వాటిక కు స్థలం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆర్.డి.ఓ. సాయి రామ్, జిల్లా మైనారిటీ అధికారి జెంలా నాయక్, మునిసిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, మెదక్ నియోజక వర్గ క్రిస్టియన్ సెలెబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు రెవరెండ్ సంజీవరావు, అశోక్, కౌన్సిలర్లు , కో అప్షన్ సభ్యులు, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.