అధికార పార్టీలో పదవుల పంచాయితీ.. ఆ ఎమ్మెల్సీపై ఆరోపణలు!

విధాత‌: నామినేటెడ్ పోస్టుల‌ను మంత్రి మల్లారెడ్డి అనుచరులకే కట్టబెట్టారని ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే మరో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీరుపై కూడా కొందరు నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మొత్తం పదవులన్నీ తన కుటుంబసభ్యులకే కట్ట బెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తీరు మార్చుకోవాలని పార్టీ అధిష్ఠానం హెచ్చరించినా ఆయన తీరు మారడం లేదనే చర్చ ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్నది. పైగా ఈసారి కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి […]

అధికార పార్టీలో పదవుల పంచాయితీ.. ఆ ఎమ్మెల్సీపై ఆరోపణలు!

విధాత‌: నామినేటెడ్ పోస్టుల‌ను మంత్రి మల్లారెడ్డి అనుచరులకే కట్టబెట్టారని ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే మరో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీరుపై కూడా కొందరు నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

మొత్తం పదవులన్నీ తన కుటుంబసభ్యులకే కట్ట బెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తీరు మార్చుకోవాలని పార్టీ అధిష్ఠానం హెచ్చరించినా ఆయన తీరు మారడం లేదనే చర్చ ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్నది. పైగా ఈసారి కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం సైతం జరుగుతున్నది.

అయితే ఇప్పటికే శంభీపూర్‌ రాజు ఎమ్మెల్సీగా కొనసాగుతూనే.. ఆయన కుటుంబ సభ్యుల్లో ఐదుగురికి పదవులు దక్కాయని ఆరోపిస్తున్నారు. అలాగే కొంతమంది కార్పొరేటర్లు కూడా పొద్దున లేస్తే ఆయన దగ్గరే ఉంటున్నారట. తాను కేటీఆర్‌కు దగ్గర అని.. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్‌ వస్తుందని అని ప్రచారం చేయించుకుంటూ.. నియోజకవర్గంలోని నేతలందరినీ తన వెంట నడిచేలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు వేలు పెట్టవద్దని సాక్షాత్తూ సీఎం చెప్పినా ఆ ఆదేశాలేవీ తనకు వర్తించవంటూ శంభీపూర్‌ వ్యవహరిస్తున్నారట. ఆయన వైఖరిపై ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. ఈ పద్ధతి మార్చుకోవాలని అధిష్ఠాన పెద్దలు ఆయనను హెచ్చరించినా మారలేదు సరికదా ఇంకా ఎక్కువగా చేస్తున్నాడనే టాక్‌ వినిపిస్తున్నది.

మంత్రి మల్లారెడ్డిపై మొదలైన అసంతృప్త గళాలు మెల్లమెల్లగా అధికార పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు బహిరంగమవుతున్నాయి. ఈ ఉదంతం ఎక్కడికి వెళ్తుందో అని పార్టీ వర్గాల్లో అంతా చర్చించుకుంటున్నారు.

ఒకవైపు బీఆర్‌ఎస్‌ అధినేత దేశ రాజకీయాలపై దృష్టి సారించి వచ్చే పది రోజుల్లో విధివిధానాలు, కార్యాచరణ ప్రకటిస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనే నేతల మధ్య పదవుల పంచాయితీలు మొదలు కావడంపై చర్చ జరుగుతున్నది.