పొత్తు ఉన్నప్పుడు 5 సీట్లు.. ఒంటరిగా వెళ్తే ఒక్కటే
విధాత: తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్నాఆలోచన బీజేపీకి లేదని, ఈ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీకి ప్రత్యామ్నాయమని, ఆ పార్టీని ఓడించేంత బలం మా పార్టీకి ఉన్నదని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నది, బీజేపీ జనసేనతో కలిసి వెళ్లాలని అక్కడి నాయకత్వం కోరుకుంటున్నది. ఒక జాతీయ పార్టీగా బీజేపీ ఒక విధానం అంటూ ఏదీ లేదనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే బీజేపీ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనడమే […]

విధాత: తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్నాఆలోచన బీజేపీకి లేదని, ఈ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీకి ప్రత్యామ్నాయమని, ఆ పార్టీని ఓడించేంత బలం మా పార్టీకి ఉన్నదని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నది, బీజేపీ జనసేనతో కలిసి వెళ్లాలని అక్కడి నాయకత్వం కోరుకుంటున్నది. ఒక జాతీయ పార్టీగా బీజేపీ ఒక విధానం అంటూ ఏదీ లేదనడానికి ఇదే నిదర్శనం.
ఎందుకంటే బీజేపీ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనడమే హాస్యాస్పదంగా ఉన్నది. 2014లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఐదు సీట్లు గెలుచుకుంటే.. టీడీపీ 15 సీట్లు గెలుచుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీ బలం ఎంతో అన్నది 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమౌతుందనే వాళ్లు ఉన్నారు. వందకుపైగా స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని బీఆర్‌ఎస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తూ ఎద్దేవా చేస్తుంటారు.
అయతే తరుణ్‌చుగ్ అన్నట్టు బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా, టీడీపీతో కలిసి పోటీ చేసినా.. వాళ్లు బీఆర్‌ఎస్‌కు కాదు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోగలుగుతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే స్థానాల పరంగా చూసినా, అభ్యర్థుల పరంగా చూసినా కాంగ్రెస్‌ఫార్టీ వాళ్లే బలంగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో పట్టున్న నాయకులు కనిపిస్తారు.
కానీ కాషాయ పార్టీలో అలాంటి నేతలు ఎంత మంది ఉన్నారు? ఒకవేళ ఐదు పది మంది ఉన్నా వారి వ్యక్తిగత ప్రతిష్టే తప్పా పార్టీ ప్రభావం ఎక్కడ ఉన్నదని అనే వాదనలు ఉన్నాయి. రాజగోపాల్‌రెడ్డి వంటి నేత ఓడిపోయాడు అంటేనే బీజేపీని బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టగలిగే నేతలు ఎంతమంది ఉన్నారు అనే చర్చ జరుగుతున్నది.
కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ లేదా, కాంగ్రెస్ పార్టీలకు మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో తమ పార్టీ బలోపేతమవుతుందని, ఫలితంగా తాము వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తరుణ్‌చుగ్ మాటల ఆంతర్య ఉద్దేశం ఇదేనని వారి మాటలను బట్టి అర్థమౌతున్నది.
అయితే టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా వెళ్లే సహసం చేయకపోవచ్చు అనే చర్చ నడుస్తున్నది. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అసెంబ్లీ సీట్ల కంటే పార్లమెంటు సీట్లే ముఖ్యమని ఆ దిశగా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నదని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.