Clouds Came Down To Earth| అద్బుతం..భువికి దిగిన మేఘాలు..పిల్లలకు ఆట వస్తువులు

విధాత : ఆకాశంలో తెలియాడే మేఘాలు అంబరాన్ని వీడి భువికి చేరాయి. ఈ అద్భుత దృశ్యాలు శ్రీకాకుళం జిల్లాలో తారసిల్లాయి. పాల నురగులాంటి తెల్లటి మేఘాలు ఆకాశం నుంచి పొలాల్లో పడిపోయాయి. అలా పొలాల్లో పడిన మేఘాలు పాల నురుగలా గాలిలో తేలిపోతుండగా..వాటిని సరదాగా పట్టుకునేందుకు అక్కడి పిల్లలు వాటి వెంట పడ్డారు. ఈ అరుదైన దృశ్యాలకు వేదికైంది శ్రీకాకుళం జిల్లా. నింగి నుంచి రాలిపడినట్లుగా మేఘాలు నేరుగా భూమిపై పడిపోయాయంటూ అక్కడి స్థానికులు అంటున్నారు.
దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దివి నుంచి భువికి వచ్చిన మేఘాలను చూసిన యువకులు వాటిని పట్టుకుని పరవశించిపోయారు. మేం మేఘాలను పట్టుకున్నామంటూ సరదాగా కామెంట్లు పెట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ తెల్లటి మేఘం ఆకారంలో ఉన్న నురగ వంటి పదార్థం అక్కడి పొలాల్లో లభ్యమైంది. దీంతో ఆకాశం నుంచి మేఘాలు నేరుగా భూమిపై పడిపోయాయంటూ అక్కడి స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్రహ్మం గారు… pic.twitter.com/H01Iwcpgl4
— ChotaNews App (@ChotaNewsApp) June 26, 2025