మంత్రి అంబటి రాంబాబు.. మాములు ‘కళాకారుడు’ కాదండోయ్!
విధాత: ఈ వైరల్ ప్పపంచంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో ఎవరికీ అంతుపట్టదు. గతంలో ఎప్పుడో జరిగిపోయింది పురావస్తు తవ్వకాలు జరిపి బయటికి తీసి వైరల్ చేస్తూ ఉంటారు. అలా వచ్చినవే ఈ ఫొటోలు పైగా ప్రస్తుత అంబటి రాంబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రివి. కొన్నాళ్లుగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఎవరైనా మాట్లాడితే.. వారికి వెంటనే కౌంటర్లు వేసేందుకు మైకు ముందుకు వచ్చే అంబటి రాంబాబుకు రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి […]

విధాత: ఈ వైరల్ ప్పపంచంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో ఎవరికీ అంతుపట్టదు. గతంలో ఎప్పుడో జరిగిపోయింది పురావస్తు తవ్వకాలు జరిపి బయటికి తీసి వైరల్ చేస్తూ ఉంటారు. అలా వచ్చినవే ఈ ఫొటోలు పైగా ప్రస్తుత అంబటి రాంబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రివి.
కొన్నాళ్లుగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఎవరైనా మాట్లాడితే.. వారికి వెంటనే కౌంటర్లు వేసేందుకు మైకు ముందుకు వచ్చే అంబటి రాంబాబుకు రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వరించింది. ఆ విస్తరణలో ఆయన జలవనరుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
అయితే కొన్ని రోజుల క్రితం ఆయన ఓ కాంట్రవర్సీకి గురయ్యారు. ఆ కాంట్రవర్సీ విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలోనే అంబటికి మంత్రి పదవి దక్కడం నిజంగా గొప్ప విషయమే. ఇక మంత్రిగా ఆయన తనదైన శైలిలో నడుచుకుంటు ముందుకు వెళుతున్నారు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి ముచ్చట అయితే అతనికి తీరింది.
అయితే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో.. లేదో.. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన యవ్వన వయస్సులో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు అందులో ఉన్నది అంబటేనా? అనేంతగా ఈ ఫొటోపై టాక్ అప్పటి నుంచి నడుస్తుంస్తూ వస్తుంది.
ఎందుకంటే, ఈ ఫొటోలో అంబటి రాంబాబు నటుడిగా తన టాలెంట్ చూపిస్తున్నారు. ఇంత వరకు ఆయన ఎక్కడా, నటుడిగా నేనూ చేశానని ప్రస్తావించలేదు. కానీ ఈ ఫొటోల్లో సీరియల్ నటి శృతి జోడిగా ఆయన కలిసి నటించిన ఫొటోలను చూస్తుంటే.. నటుడిగానూ ఆయన కొన్ని పాత్రలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన చేసిన పాత్రలు లేదంటే సినిమాలు, సీరియళ్లు ఏంటనేది మాత్రం తెలియరాలేదు.
ఆయన నటించినవి అసలు విడుదల అయ్యాయా? అనే డౌట్స్ కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలు సీరియల్‌కి సంబంధించినవి అని మాత్రం అర్థమవుతుంది.
అయితే ఎప్పుడు ఆయన యాక్టింగ్ చేశారనేది.. ఆయనే చెబితేనే జనాతకు తెలుస్తుంది. ఇప్పుడా సందర్భం కూడా వస్తది. ఈ ఫొటోలు కొన్ని రోజుల్లో మరింత వైరల్ అవడం ఖాయం. ఆ తర్వాత ఆయనని మీడియా ఏదో సమయంలో అడగక మానదు.. ఆయన చెప్పకా తప్పదు అప్పటిదాకా మనం వేచి చూడాల్సిందే.
గతంలో ఈ ఫొటోలని చూపించి.. ఇదీ మా అంబటి టాలెంట్ అంటూ వైసీపీ బ్యాచ్ సోషల్ మీడియాలో మోత మోగించింగా.. అంబటి ‘కళాకారుడు’ అనే విషయం ఈ ఫొటోల ద్వారా మరోసారి నిరూపితమైందని.. ఆయన వ్యతిరేక బ్యాచ్ కూడా కౌంటర్లు ఇచ్చింది. ఇలా అంబటి అటు మంత్రిగానూ, ఇటు కళాకారుడిగానూ ఒకే రోజు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ పాలిటిక్స్‌గా మారారు.