Amith shah | అమిత్ షా అందరినీ కలుస్తారు.. పవన్‌ కళ్యాణ్‌ను తప్ప!

Amith shah విధాత‌: హేమిటో.. బిజెపి నాయకుల తీరు.. ఎవరెవర్నో కలుస్తారు కానీ తమతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ను మాత్రం కలవరు. అసలు అయన ఉనికిని సైతం గుర్తించనట్లే ఉంటారు. వాస్తవానికి గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ,మహా జన సంపర్క్ కార్యక్రమంలో భాగంగా తటస్థులు అనుకున్నవారిని లేదా, సమాజంలో పేరున్నవారిని, ప్రముఖులను కలుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో రామోజీరావు.. జూ. ఎన్టీయార్, షట్లర్ […]

Amith shah | అమిత్ షా అందరినీ కలుస్తారు.. పవన్‌ కళ్యాణ్‌ను తప్ప!

Amith shah

విధాత‌: హేమిటో.. బిజెపి నాయకుల తీరు.. ఎవరెవర్నో కలుస్తారు కానీ తమతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ను మాత్రం కలవరు. అసలు అయన ఉనికిని సైతం గుర్తించనట్లే ఉంటారు. వాస్తవానికి గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ,మహా జన సంపర్క్ కార్యక్రమంలో భాగంగా తటస్థులు అనుకున్నవారిని లేదా, సమాజంలో పేరున్నవారిని, ప్రముఖులను కలుస్తూ వస్తున్నారు.

ఇందులో భాగంగా గతంలో రామోజీరావు.. జూ. ఎన్టీయార్, షట్లర్ పుల్లెల గోపీచంద్ వంటి వారిని కలిశారు. గురువారం అంటే రేపు సినీ డైరెక్టర్ రాజమౌళిని, ఇంకా ఆంధ్రజ్యోతి ఎండీ అమిత్ షాను కలుస్తున్నారు. వీళ్లంతా ఓకే.. వాస్తవానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే బిజెపి రాజ్యసభ సభ్యుడు కాబట్టి అక్కడికి వెళ్లడం వింత కాదు.

ఐతే ఇంతా చేస్తున్న బిజెపి పెద్దలు తమ రాజకీయ పోటు పొత్తుదారు పవన్ కళ్యాణ్నుమాత్రం కలవడం లేదు.. పోనీ ఈయన ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్ అడిగినా టైం ఇవ్వడం లేదు.. పవన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా లేదా ఎవరో మంత్రులను కలిసి రాష్ట్రం కోసం ఓ వినతిపత్రం ఇచ్చి రావడం తప్ప ఏనాడూ అమిత్ షాను కలవలేదు. పోనీ అప్పుడు అంటే ఏదో బిజీగా ఉన్నారు అనుకుందాం.

మరి అమిత్ షా ఆంధ్ర వచ్చినపుడు అయినా పవన్ను కలవాలి కదా.. పోనీ పిలిస్తే ఈయనే వెళ్లి కలిసివారు కదా. మరి ఎందుకు ఆమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అంటే పవన్ ను ఢిల్లీ వాళ్ళు లైట్ గా తీసుకుంటున్నారా.? ఆయన కూరలో కరివేపాకు టైపు అని వాళ్ళు భావిస్తున్నారా ? అందుకే పక్కనబెట్టేశారా అనే డవుట్స్ వస్తున్నాయి.