28న రామప్పలో రాష్ట్రపతి ముర్ము పర్యటన.. ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ కృష్ణ ఆదిత్య
విధాత, వరంగల్: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శనకు 28న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య తెలిపారు. సోమవారం రామప్ప ఆలయంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏ ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకేన్, అదనపు కలెక్టర్ వైవి గణేష్ తో కలిసి రామప్పలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ […]

విధాత, వరంగల్: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శనకు 28న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య తెలిపారు.
సోమవారం రామప్ప ఆలయంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏ ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకేన్, అదనపు కలెక్టర్ వైవి గణేష్ తో కలిసి రామప్పలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందన్నారు. రామప్ప దేవాలయం సుందరీకరణతో అలంకరణ పూర్తి చేసామన్నారు.
బార్కేడ్లు, పార్కింగ్ ఏరియా వివరాలు వెల్లడించారు. రామప్ప గార్డెన్ అందంగా తీర్చిదిద్దామని, తాగునీటి సదుపాయం, రామప్ప ప్రాంగణంమంతా శానిటైజేషన్ అంతర్గత కీటకాలు ప్రవేశించకుండా బ్లీచింగ్ ప్రత్యేక సిబ్బందిని నియమించడంతో పాటు అనేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అంతేకాకుండా భద్రత పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం పైలెట్ ప్రాజెక్టు రామప్పలో రాష్ట్రపతి ప్రారంభిస్తారని, గిరిజన జిల్లా అయినందున ఆదివాసి కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
కలెక్టర్ వెంట డిఆర్ఓ కె రమా దేవి, డిపిఓ కె వెంకయ్య, పంచాయతి రాజ్ ఈ ఈ రవీందర్, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేష్, డి ఈ ఇరిగేషన్ వెంకట కృష్ణారావు, పాలంపేట సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.