YS Sharmila | షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత బీఎన్ రెడ్డి నగర్‌లో ధర్నా

YS Sharmila | గిరిజన మహిళకు న్యాయం కోసం డిమాండ్‌ విధాత: ఎల్బీనగర్ పోలీసులు గిరిజన మహిళ లక్ష్మిపై చేసిన థర్డ్‌డిగ్రీ హింసను నిరసిస్తు బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీఎన్‌రెడ్డి నగర్ శ్యామ్ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. లక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు ఆసుపత్రి ముందు సాగర్ ప్రధాన రహదారిపై షర్మిల బైఠాయించి ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు […]

  • By: krs    latest    Aug 20, 2023 4:28 PM IST
YS Sharmila | షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత బీఎన్ రెడ్డి నగర్‌లో ధర్నా

YS Sharmila |

  • గిరిజన మహిళకు న్యాయం కోసం డిమాండ్‌

విధాత: ఎల్బీనగర్ పోలీసులు గిరిజన మహిళ లక్ష్మిపై చేసిన థర్డ్‌డిగ్రీ హింసను నిరసిస్తు బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీఎన్‌రెడ్డి నగర్ శ్యామ్ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.

లక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు ఆసుపత్రి ముందు సాగర్ ప్రధాన రహదారిపై షర్మిల బైఠాయించి ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా షర్మిల వారితో వాగ్వివాదానికి దిగింది.

దీంతో పోలీసులకు, షర్మిల వర్గీయులకు మధ్య తోపులాట నెలకొని కొంత ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పోలీసులు షర్మిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు తిప్పుతూ లోటస్ ఫాండ్ మార్గంలో వెళ్లారు.

అంతకుముందు ఆమె బాధిత గిరిజన మహిళ లక్ష్మిని పరమార్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతు పోలీసులు లక్ష్మిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అన్ని చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు.

బాధ్యులైన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని విమర్శించారు. తెలంగాణ పోలీసులు అధికార పార్టీకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసులని ప్రజలకు, ప్రతిపక్షాలకు మాత్రం కాదన్నట్లు వారి వ్యవహారశైలీ ఉందంటు విమర్శించారు.