కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్
విధాత: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పంజాబ్ క్యాడర్ విశ్రాంత ఐఏఎస్ అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అరుణ్‌గోయల్ కేంద్రంలో వివిధ శాఖల్లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఆర్థిక, విద్యుత్, వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. 2003-04 కాలంలో ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిగా, 2006-10 వరకు కేంద్ర ఆర్థిక శాఖలోని ఆర్థిక నిఘా విభాగాధిపతిగా […]

విధాత: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పంజాబ్ క్యాడర్ విశ్రాంత ఐఏఎస్ అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
అరుణ్‌గోయల్ కేంద్రంలో వివిధ శాఖల్లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఆర్థిక, విద్యుత్, వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. 2003-04 కాలంలో ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిగా, 2006-10 వరకు కేంద్ర ఆర్థిక శాఖలోని ఆర్థిక నిఘా విభాగాధిపతిగా పనిచేశారు.
ముగ్గురు సభ్యులు ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘంలో ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, మరో కమిషనర్ అనూప్ చంద్రపాండే ఉన్నారు. మూడో కమిషనర్‌గా అరుణ్ నియమితులయ్యారు.