బీహర్‌: ‘వందేభారత్’కు ప్రజల నిరసన సెగ.. రాళ్లదాడి

విధాత: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంకగా ప్రవేశ పెట్టిన ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలుపై సామాన్యుల ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉన్నది. తాజాగా బీహార్‌లోని కతిహార్‌ జిల్లా డకోలా-టెల్టా స్టేషన్ల మధ్య కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వందేభారత్ రైలుపై రాళ్లు విసిరారు. డిసెంబర్‌ 31న ప్రారంభమైన తర్వాత ఇప్పటికే రెండు సార్లు రైలుపై రాళ్లు విసిరిన ఘటనలు జరిగాయి. ఇది వరుసగా మూడోది. రాళ్లు విసిరిన ఘటనలో రైలు సీ-6కోచ్‌ అద్దం పగిలిపోయింది. ప్రయాణికులకు గాయాలేమీ కాలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం […]

  • By: krs    latest    Jan 21, 2023 11:33 AM IST
బీహర్‌: ‘వందేభారత్’కు ప్రజల నిరసన సెగ.. రాళ్లదాడి

విధాత: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంకగా ప్రవేశ పెట్టిన ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలుపై సామాన్యుల ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉన్నది. తాజాగా బీహార్‌లోని కతిహార్‌ జిల్లా డకోలా-టెల్టా స్టేషన్ల మధ్య కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వందేభారత్ రైలుపై రాళ్లు విసిరారు.

డిసెంబర్‌ 31న ప్రారంభమైన తర్వాత ఇప్పటికే రెండు సార్లు రైలుపై రాళ్లు విసిరిన ఘటనలు జరిగాయి. ఇది వరుసగా మూడోది. రాళ్లు విసిరిన ఘటనలో రైలు సీ-6కోచ్‌ అద్దం పగిలిపోయింది. ప్రయాణికులకు గాయాలేమీ కాలేదు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ప్రత్యేకంగా రైల్వే బడ్జెటును తొలగించి దాన్ని కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశ పెడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వ్యవస్థగా ఉన్న భారతీయ రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ మోదీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.

ఏడాది కాలంలో దేశంలో సాధారణ ఎన్నికలు రాబోతున్న వేళ… ‘వందేభారత్‌ రైలు’ను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. దాంతో మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నమే వందేభారత్‌ రైలు అనే అభిప్రాయం ఉన్నది.

అయితే.. ఈ రైలులో సాధారణ పౌరుడు ప్రయాణించే స్థితి లేదు. కొని ప్రాంతాల మధ్య విమానం టికెట్టు కన్నా వందేభారత్‌ రైలు టికెట్టే ఎక్కువ ఉన్నదన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోంచే ఈ రైలు తమ కోసం కాదన్న భావనతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోంచే.. ఇటీవలే సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైలుపై వైజాగ్‌లో రాళ్లదాడి జరుగటం గమానర్హం.