ఛత్తీస్‌గఢ్‌: ఆదివాసి క్రిస్టియన్లపై దాడులు

క్రిస్టమస్‌ పండువేళ ఆదివాసీ క్రిస్టియన్లపై దాడులు చేస్తున్న హిందుత్వ శక్తులు విధాత: బీజేపీ మెజారిటీవాద రాజకీయం వికృత పోకడలు పోతున్నది. అన్యులంతా శత్రువులే అన్నతీరుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటిదాకా ముస్లిం మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగించిన RSS హిందుత్వ శక్తులు ఇప్పుడు క్రిస్టమస్‌ పండుగ వేళ క్రిస్టియన్లపై దాడులకు తెగబడుతున్నది. బస్తర్‌ రీజియన్‌ ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ ప్రాంతంలో ఆదివాసులైన క్రిస్టియన్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నది. మొన్న ఆదివారం డిసెంబర్‌ 18న ఒక్కరోజే అనేక చోట్ల హింసాత్మక దాడులు చేసింది. […]

ఛత్తీస్‌గఢ్‌: ఆదివాసి క్రిస్టియన్లపై దాడులు
  • క్రిస్టమస్‌ పండువేళ ఆదివాసీ క్రిస్టియన్లపై దాడులు చేస్తున్న హిందుత్వ శక్తులు

విధాత: బీజేపీ మెజారిటీవాద రాజకీయం వికృత పోకడలు పోతున్నది. అన్యులంతా శత్రువులే అన్నతీరుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటిదాకా ముస్లిం మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగించిన RSS హిందుత్వ శక్తులు ఇప్పుడు క్రిస్టమస్‌ పండుగ వేళ క్రిస్టియన్లపై దాడులకు తెగబడుతున్నది.

బస్తర్‌ రీజియన్‌ ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ ప్రాంతంలో ఆదివాసులైన క్రిస్టియన్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నది. మొన్న ఆదివారం డిసెంబర్‌ 18న ఒక్కరోజే అనేక చోట్ల హింసాత్మక దాడులు చేసింది. ఈ దాడులకు స్థానిక బీజేపీ నేతలే నాయకత్వం వహిస్తున్నారని ఆదివాసులు ఆరోపిస్తున్నారు.

ఈ విధమైన దాడులు ఇదే మొదటి సారి కాదని ఆదివాసులు అంటున్నారు. గత నెల డిసెంబర్‌లో 21 చోట్ల దాడులు చేశారు. నవంబర్‌లో 15 చోట్ల దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా పదులు, వందల సంఖ్యలో హిందుత్వ గూండాలు గిరిజన గ్రామాలపై పడి ఇండ్లను ద్వంసం చేస్తున్నారు.

అందిన కాడికి దోచుకుపోతున్నారు. స్త్రీలు, పిల్లలు అని చూడకుండా దాడి చేసి కొడ్తున్నారు. బూతులు తిడుతూ హింసిస్తున్నారని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. కేవలం తాము క్రిస్టియన్‌ సంప్రదాయాలను పాటిస్తున్నందుకే స్థానిక బీజేపీ నేతలు తమపై కత్తిగట్టారని ఆరోపిస్తున్నారు.

తమపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున గిరిజనులు స్థానిక కలెక్టరేట్‌ ముందు ధర్నాకు దిగారు. దాడులకు నేతృత్వం వహించిన నారాయణపూర్‌ జిల్లా బీజేపీ అధ్య క్షుడు రూప్‌సాయ్‌ సాలమ్‌, బేనూరు ప్రాంత బీజేపీ నేత పుల్సా కచ్నం ఇతరులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. క్రిస్టమస్‌ ఈవ్‌ సందర్భంగా బీజేపీ-ఆర్‌ఎస్సెస్‌ శక్తులు ఈ విధమైన దాడులకు పాల్పడటం గర్హనీయమని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.