అయ్యన్నకు మళ్ళీ చిర్రెత్తింది! ఎవడీ గంటా.. లక్షల్లో ఒకడంటూ కామెంట్స్!
విధాత: సీనియర్ టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు మళ్లోసారి చిర్రెత్తి పోయారు. మరో నాయకుడు గంటా ఉనికి గిట్టని అయ్యన్న ఏకంగా మీడియాలో మాట్లాడుతూ గంటా ఎవడండీ.. లక్షల్లో ఒకడు.. అంటూ ఆగ్రహానికి పోయారు. గంటా శ్రీనివాసరావు పెద్ద అవకాశవాద రాజకీయానికి పెట్టింది పేరు.. గత ఇరవయ్యేళ్లుగా అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే గంటా అంటే అయ్యన్నకు అసలు గిట్టదు. ఏ చిన్న అవకాశం వచ్చినా గంటా మీద దాడికి ఏమాత్రం వెనుకాడని అయ్యన్న ఈరోజు కూడా […]

విధాత: సీనియర్ టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు మళ్లోసారి చిర్రెత్తి పోయారు. మరో నాయకుడు గంటా ఉనికి గిట్టని అయ్యన్న ఏకంగా మీడియాలో మాట్లాడుతూ గంటా ఎవడండీ.. లక్షల్లో ఒకడు.. అంటూ ఆగ్రహానికి పోయారు.
గంటా శ్రీనివాసరావు పెద్ద అవకాశవాద రాజకీయానికి పెట్టింది పేరు.. గత ఇరవయ్యేళ్లుగా అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే గంటా అంటే అయ్యన్నకు అసలు గిట్టదు. ఏ చిన్న అవకాశం వచ్చినా గంటా మీద దాడికి ఏమాత్రం వెనుకాడని అయ్యన్న ఈరోజు కూడా విరుచుకుపడ్డారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. ఎవడండీ గంటా? లక్షలాది పార్టీ కార్యకర్తల్లో వాడొక్కడు.. ఆ లక్షల్లో నేనొక్కడిని.. గంటా ఏమైనా పెద్ద నాయకుడా?. ప్రధానా?. పార్టీ కోసం అందరూ పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం కృషి చేసిన వారే నిజమైన నాయకులు అంటూనే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ పార్టీలో కనపడుతున్నారని విమర్శించారు.
2019 టీడీపీ అధికారానికి దూరం అయినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తూ వస్తున్నా గంటా.. అప్పుడప్పుడు వైసీపీ, బీజేపీ అంటూ లీకులు ఇచ్చుకుంటూ రాజకీయం చేసిన గంటా.. వచ్చే ఏడాది ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మీడియాతో మాట్లాడారు.
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. బహుశా చంద్రబాబు మళ్లీ గంటాకు పార్టీలో ఉన్నత స్ధానం ఇస్తారనే అభయం అయ్యన్నకు ఉందేమో.. అందుకే ముందు జాగ్రతగా గంటాను టార్గెట్ చేశారు.
అంతెందుకూ గతంలో 2014-19 మధ్య గంటా, అయ్యన్న ఇద్దరూ టీడీపీ కేబినెట్లో ఉండేవారు. ఓసారి పార్టీ సమావేశంలోనే గంటా మీద అయ్యన్న విరుచుకుపడ్డారు. గంటాను అవకాశవాదిగా పేర్కొంటూ ఆనాడే దుమ్ము దులిపేశారు. అన్నట్లు అయ్యన్న ఇప్పుడు హోమ్ మంత్రి రేసులో ఉన్నారట. టిడిపి గానీ గవర్నమెంట్ లోకి వస్తే అయ్యన్నకు హోమ్ మంత్రి కావాలని ఉందట.