చంద్రబాబు సభల తొక్కిసలాటపై విచారణ!
విధాత: చంద్రబాబు పాల్గొన్న రెండు సభల్లో జరిగిన తొక్కిసలాట, 11 మంది మరణించిన సంఘటనల మీద విచారణకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాజీ హైకోర్టు జడ్జ్ సారథ్యంలో కమిటీని నియమించింది. కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల మీద విచారణకు రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ బి.శేష శయన రెడ్డి నేతృత్వంలో కమిటిని నియమించింది. చంద్రబాబు పాల్గొన్న ఈ రెండు సభల్లోనూ కందుకురులో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతి చెందారు. కాగా ఈ […]

విధాత: చంద్రబాబు పాల్గొన్న రెండు సభల్లో జరిగిన తొక్కిసలాట, 11 మంది మరణించిన సంఘటనల మీద విచారణకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాజీ హైకోర్టు జడ్జ్ సారథ్యంలో కమిటీని నియమించింది.
కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల మీద విచారణకు రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ బి.శేష శయన రెడ్డి నేతృత్వంలో కమిటిని నియమించింది.
చంద్రబాబు పాల్గొన్న ఈ రెండు సభల్లోనూ కందుకురులో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతి చెందారు. కాగా ఈ ఘటనలపై జస్టిస్ శేషశయన రెడ్డి కమిషన్ విచారణ జరిపి నెల రోజుల్లో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. నివేదికలో పేర్కొన్న బాధ్యుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
మొత్తానికి ఈ రెండు ఘటనల్లోనూ ఎవర్నీ బాధ్యులను చేస్తారో చూడాలి.. పోలీసులు.. ఇతర ప్రభుత్వ అధికారులు.. అటు ప్రతిపక్ష నాయకులు సైతం ఇందులో పాత్రధారులే కాబట్టి ఏ స్థాయిలో ఎవర్ని బుక్ చేస్తారో చూడాలి.