బాలయ్య కౌంటర్.. వైసీపీ సోషల్ మీడియా ఎన్‌కౌంటర్!
విధాత: ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడం మీద మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని మీద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ పోస్టు తాజాగా నిప్పు రాజేయగా అట్నుంచి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కూడా అంతే తీవ్రంగా ప్రతి స్పందిస్తోంది. ఈమేరకు బాలయ్య ఓ పోస్టులో.. మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ […]

విధాత: ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడం మీద మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని మీద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ పోస్టు తాజాగా నిప్పు రాజేయగా అట్నుంచి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కూడా అంతే తీవ్రంగా ప్రతి స్పందిస్తోంది.
ఈమేరకు బాలయ్య ఓ పోస్టులో.. మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు పంచభూతాలున్నా య్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..అంటూ బాలయ్య తీవ్ర పదజాలంతో జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు.
గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును తీసేసి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు ముఖ్యమంత్రి అయ్యి విమానాశ్రయం పేరు మార్చాడని మండిపడ్డారు.
ఇప్పుడు కొడుకు జగన్ యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని ధ్వజమెత్తారు. మార్చడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు. ఓ సంస్కృతి.. నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్ అంటూ పోస్టు చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో పదవుల్లోకి వచ్చిన నాటి నేతలు ఇప్పుడు వేరే పార్టీలో ఉండి విశ్వాసం లేని కుక్కల్లా ఉన్నారని పరోక్షంగా మంత్రి రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులపై బాలకృష్ణ మండిపడ్డారు.
వీరంతా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన వారే అన్నది అందరికి తెలిసిందే. ఇలాంటి పాలన ఉన్న జగన్ వంటి వారిని పంచభూతాలే మారుస్తాయ్ అంటూ రాజశేఖరరెడ్డి మరణం తీరును గుర్తు చేసినట్లుగా ట్వీట్ చేశారు. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకుని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నిప్పులు చెరుగుతోంది.
గతంలో ఏదో సినిమా ప్రమోషన్ మీటింగులో బాలయ్య మాట్లాడుతూ అమ్మాయి కనిపిస్తే కడుపైనా చెయ్యాలి. ముద్దైనా పెట్టాలి అన్నా మాటలు గుర్తు చేస్తూ ఇదేనా మీ నాన్న ఎన్టీఆర్ నేర్పిన సంస్కృతి అని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను బయటకు తెచ్చి నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దయతో కేసునుంచి తప్పించుకున్నాడు లేకుంటే ఈపాటికి జైల్లో ఉండేవాడని బాలయ్యను వెక్కిరిస్తున్నారు. ఏదైనా గానీ చల్లారినట్లున్న ఈ పేరు మర్పిడి వ్యవహారాన్ని బాలయ్య మళ్ళీ రాజేసినట్లు అయింది.