Warangal | విద్యుత్ స్తంభంపై నుంచి పడి బల్దియా ఉద్యోగి మృతి
Warangal | మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం నగర మేయర్ గుండు సుధారాణి అంత్యక్రియలకు రూ 10 వేలు అందజేత. విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ గోపాలపుర్‌లోని సురేంద్రపురి కాలనీలో గురువారం విద్యుత్ స్తంభంపైన మరమత్తులు నిర్వహిస్తున్న బల్దియా విద్యుత్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇమ్మడి చంద్రశేఖర్ (50) ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. మేయర్ కమిషనర్ పరామర్శ కార్మికుడి మృతి సమాచారం తెలిసిన వెంటనే ఎంజీఎం మార్చురీ కి వెళ్ళిన మేయర్ గుండు సుధారాణి […]

Warangal |
- మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం
- నగర మేయర్ గుండు సుధారాణి
- అంత్యక్రియలకు రూ 10 వేలు అందజేత.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ గోపాలపుర్‌లోని సురేంద్రపురి కాలనీలో గురువారం విద్యుత్ స్తంభంపైన మరమత్తులు నిర్వహిస్తున్న బల్దియా విద్యుత్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇమ్మడి చంద్రశేఖర్ (50) ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు.
మేయర్ కమిషనర్ పరామర్శ
కార్మికుడి మృతి సమాచారం తెలిసిన వెంటనే ఎంజీఎం మార్చురీ కి వెళ్ళిన మేయర్ గుండు సుధారాణి ,కమీషనర్ రిజ్వాన్ బాషా షేక్ లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మేయర్ అన్నారు.
బల్దియా తరవున అన్ని విధాలుగా ఆదుకుంటామని, మృతుని కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ పద్దతి లో ఉద్యోగం ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు. బల్దియా తరపున అంత్యక్రియలకు రూ 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, ఇంచార్జి ఈ.ఈ.సంజయ్ కుమార్, ఏ.ఈ.సరిత తదితరులు పాల్గొన్నారు.