మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్

అభినందించిన సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ నేతలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని చెప్పారు. […]

మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్
  • అభినందించిన సీఎం కేసీఆర్
  • శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ నేతలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని చెప్పారు. మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు. విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు.

ఆయన సేవలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో అవసరమని చెప్పారు. డిప్యూటీ చైర్మన్‌గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాని తెలిపారు. బండ ప్రకాశ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి, అరూరీ రమేష్, యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, బొడకుంటి వెంకటేశ్వర్లు, సమ్మారావు వరంగల్ జిల్లా నాయకులు అభినందించిన వారిలో ఉన్నారు.