ఆ.. ‘బండి’ వీడియోల వెనక ఉన్నది సొంత పార్టీ నేతలేనా?
విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాం అని ప్రసంగాలు చేస్తుంటారు. అట్లనే మనం 80 శాతం మందిమి అన్నా.. అంటూ భావోద్వేగంగా మాట్లాడుతుంటారు. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం కోసం ఆయన ఇలాంటి ప్రసంగాలు చేస్తారు. అయితే దేశం కోసం కష్టపడుతున్న సంజయ్ సన్ స్ట్రోక్ తగిలింది. తన తండ్రి చేసే ఎమోషనల్ వ్యాఖ్యల ప్రభావం భగీరథ మీద పడింది కావొచ్చు. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో […]

విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాం అని ప్రసంగాలు చేస్తుంటారు. అట్లనే మనం 80 శాతం మందిమి అన్నా.. అంటూ భావోద్వేగంగా మాట్లాడుతుంటారు. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం కోసం ఆయన ఇలాంటి ప్రసంగాలు చేస్తారు. అయితే దేశం కోసం కష్టపడుతున్న సంజయ్ సన్ స్ట్రోక్ తగిలింది.
తన తండ్రి చేసే ఎమోషనల్ వ్యాఖ్యల ప్రభావం భగీరథ మీద పడింది కావొచ్చు. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న సంజయ్ తనయుడు సాయి భగీరథ శ్రీరామ్ అనే విద్యార్థిపై చేయ చేసుకున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్సిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై రాజకీయ నేతలతో పాటు సోషల్ మీడియాలో సంజయ్‌పై, ఆయన తనయుడిపై విమర్శలు, సెటైర్లు పేలుతున్నాయి.
BANDI SANJAY SUN Bandi Bhagiratha Gundaism in Mahendra University #bandisanjay #BJP #BRSForIndia #TeluguNews #Telangana #Hyderabad #hyderabadfc #hyderabadtickets #Revanthreddy #JrNTR #NTR30 #ManOfMassesNTR #Vaarasadu #TRS #Telugu @bandisanjay_bjp @BJP4Telangana @INCTelangana pic.twitter.com/szJwubqYvc
— vidhaathanews (@vidhaathanews) January 17, 2023
తాజాగా సంజయ్ కుమారుడు శ్రీరామ్‌పై దాడి తర్వాత మరో విద్యార్థిపై కూడా దాడి చేసిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతున్నది టెక్ మహేంద్ర వర్సిటీలో ఇద్దరు విద్యార్థులపై చేయి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుండిగ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజీని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
ఇదిలాఉండగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉండగానే మరో వీడియో విడుదలై ఇష్యూను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఘటనలపై మీడియా ముందుకు వచ్చిన బండి సంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎవైనా ఉంటే రాజకీయాలు నాతో చేయాలి గానీ పిల్లలను ఇందులోకి లాగడమేంటని సీరియస్ అయ్యారు. పిల్లలు కొట్టుకుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. గతంలో సీఎం మనుమడిపై కామెంట్లు చేస్తే.. తానే స్వయంగా ఖండించానని, ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.
another video of #BJP #Telangana state president #BandiSanjay’s son #BandiBhageerath trashing his fellow classmates surfaced #Ragging pic.twitter.com/iA6CxWZZVI
— vidhaathanews (@vidhaathanews) January 18, 2023
తరుచూ సంజయ్ దేశం కోసం పనిచేసే క్రమశిక్షణ గల కార్యకర్తలం మేమని అంటూ ఉంటారు. మరి ఆయన తనయుడు ఇలా తోటి విద్యార్థులపై దాడి చేయడం ఎలాంటి క్రమశిక్షణ కిందికి వస్తుంది? ఇదేనా సంజయ్ తన పిల్లలకు నేర్పిన దేశభక్తి? అంతేకాదు సంజయ్ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది మేము. మేము తలుచుకుంటే ఏమైనా చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చాలా సార్లు చేశారు
#BANDISANJAY ON SON #BandiBhageerath ISSUE pic.twitter.com/gzgqWYVQt2
— vidhaathanews (@vidhaathanews) January 18, 2023
బహుశా భగీరథ తన తండ్రి అండ చూసుకునే తోటి విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నాడని విమర్శలు వెల్లువెతుతున్నాయి. అలాగే సంజయ్ ఏకపక్ష వైఖరి, పార్టీలో ఎవరినీ లెక్క చేయకపోవడం వంటి పరిణామాలతో విసిగిపోయిన సొంత పార్టీ నేతలే ప్రస్తుతం ఈ వీడియోలు బైటికి రావడానికి కారణమనే చర్చ కూడా జరుగుతున్నది. తనయుడి దాడులపై క్రమశిక్షణ కలిగిన దేశభక్తుడిగా, ప్రజాప్రతినిధిగా ఎలా వ్యవహరిస్తారో చూడాలి అంటున్నారు.