Bhatti | BRSను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నరు: భట్టి జోస్యం

Bhatti Vikramarka అప్పుల తెలంగాణ చేసినందుకు శిక్ష తప్పదు కార్మికులు నిరుద్యోగులు, విద్యార్థులు ఒకటైతున్నారు వర్షంలో సాగిన భట్టి పాదయాత్ర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అప్పుచేసి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టిన BRSను వదిలించు కోవాలని ప్రజలు రెడీగా ఉన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం హనుమకొండ ఫాతిమా నగర్ కార్నర్ […]

Bhatti | BRSను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నరు: భట్టి జోస్యం

Bhatti Vikramarka

  • అప్పుల తెలంగాణ చేసినందుకు శిక్ష తప్పదు
  • కార్మికులు నిరుద్యోగులు, విద్యార్థులు ఒకటైతున్నారు
  • వర్షంలో సాగిన భట్టి పాదయాత్ర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అప్పుచేసి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టిన BRSను వదిలించు కోవాలని ప్రజలు రెడీగా ఉన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం హనుమకొండ ఫాతిమా నగర్ కార్నర్ మీటింగ్‌లో ఆయన చేసిన కామెంట్స్ ఇలాఉన్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులతో తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంకగా మారే ప్రమాదం ఉన్నదన్నారు. ధరణి తీసుకువచ్చి ఆదివాసులకు, గిరిజనులకు భూమిపై హక్కు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.

సింగరేణి ప్రైవేటీకరణతో ఉద్యోగాలు కొల్లగొడుతున్న దుర్మార్గ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని సింగరేణి కార్మికులు చెప్పారన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేసి సాగునీరు ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి రామగుండం ప్రజలు చెప్పిన మాటలు మీతో పంచుకుంటున్నాను.

బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు తోడుదొంగలుగా సంపాదను దోచుకుంటున్నారు.ఇందిరమ్మ రాజ్యం వస్తేనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండ రోడ్డున పడేసిన ప్రభుత్వానికి విద్యార్థుల ఉసురు తగులుతుంది. ప్రశ్న పత్రం పేపర్ లీకేజీ చేసి తమ జీవితాలతో చెలగాటమాడిన ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిస్తామని కాకతీయ విద్యార్థులు చెప్పారు.

ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తారని నమ్ముతున్నాను. పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి భట్టి పాదయాత్ర దోహదపడుతుంది. మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నది. పిసిసి మాజీ అధ్యక్షులు విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ భట్టి పాదయాత్ర, రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన ర్యాలీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడతాయి.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పట్ల బిజెపి చేస్తున్న కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. బిజెపిని బిఆర్ఎస్ ని ఇంటికి పంపడం ఇంకెంత దూరంలో లేదన్నారు. అనంత‌రం డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రేన్ తో భట్టికి భారీ గజమాలను వేశారు.

కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు & వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జి బి శోభారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎం.పి సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎం.ఎల్. ఏ వేం నరేందర్ రెడ్డి, టిపీసీసీ ప్రధాన కార్యదర్శులు దొమ్మాటి సాంబయ్య, కుచన రవళి, పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్ రామ్ రెడ్డి, వర్ధన్నపేట నియోజక వర్గ బాధ్యులు నమిండ్ల శ్రీనివాస్, పిసిసి సభ్యులు ఈ.వి శ్రీనివాస్ రావు, కార్పో రెటర్లు తోట వెంకన్న, పోతుల శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.