Kumbham Anil Kumar | కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. బీఆరెస్‌లోకి కుంభం అనిల్ కుమార్‌రెడ్డి

Kumbham Anil Kumar సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో చేరిక‌ వెంకట్‌రెడ్డితో పొస‌గ‌క‌ పార్టీ మార్పు విధాత: యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి సోమ‌వారం సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు జ‌గ‌దీష్ రెడ్డి, హ‌రీష్‌రావు, భువ‌నగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ విస్ గొంగిడి సునిత, జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి స‌హా జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు […]

  • By: Somu    latest    Jul 24, 2023 11:12 AM IST
Kumbham Anil Kumar | కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. బీఆరెస్‌లోకి కుంభం అనిల్ కుమార్‌రెడ్డి

Kumbham Anil Kumar

  • సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో చేరిక‌
  • వెంకట్‌రెడ్డితో పొస‌గ‌క‌ పార్టీ మార్పు

విధాత: యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి సోమ‌వారం సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు జ‌గ‌దీష్ రెడ్డి, హ‌రీష్‌రావు, భువ‌నగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ విస్ గొంగిడి సునిత, జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి స‌హా జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.. కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో నెలకొన్న విబేధాలు, బీసీలకు భువనగిరి టికెట్ కేటాయించే ఎత్తుతో తన టికెట్‌కు ఎసరు పెట్టడం వంటి పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన అనిల్‌కుమార్‌రెడ్డి సోమవారం తన వర్గీయులతో కలిసి భువనగిరిలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్‌రెడ్డి పార్టీలో తనకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు.

కాగా.. తనకు గిట్టని నాయకులను అణిచివేసే కుట్రలో భాగంగా భువనగిరి, ఇబ్రహీంపట్నం, జనగామాలలో బీసీలకు టికెట్లు ఇవ్వాలన్న వాదన తెరపైకి తెచ్చారంటు మండిపడ్డారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి, స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి,

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిలతో కలిసి అనిల్ రెడ్డి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌తో భేటీయై బీఆరెస్ కండువా క‌ప్పుకున్నారు. అనిల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బిఆరెస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.