ప్రధాని సభకు దూరంగా ఆ ఐదుగురు.. పార్టీని వీడతారని జోరుగా ప్రచారం!

విధాత, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ పర్యటనకు, బహిరంగ సభకు రాష్ట్ర బీజేపీలో ఐదుగురు కీలక నేతలు డుమ్మా కొట్టడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
ఇటీవలే వరంగల్‌లో జరిగిన కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటనలో తమకు తగిన ప్రాధాన్యం లభించలేదని అధిష్ఠానంపై గుర్రుమీదున్న విజయశాంతి, రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సోయం బాపురావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. మోదీ పర్యటనకు సైతం దూరంగా ఉండటం గమనార్హం.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
వీరంతా పార్టీని వీడేందుకు సిద్ధమైతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి. దీనికి తోడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా విలేకరుల సమావేశంలో ప్రధాని టూర్‌కు దూరంగా ఉన్న నేతల పేరు ప్రస్థావించడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరుతున్నది.