BJP | మణిపూర్ హింస పాపం బీజేపీదే
BJP విధాత: మణిపూర్‌లో చెలరేగుతున్న హింసాకాండకు అధికార బీజే ప్రభుత్వ చిల్లర రాజకీయాలే కారణమని సీపీఐ ఆరోపించింది. మణిపూర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుక్కోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండు చేశారు. సీపీఐ మణిపూర్, ఢిల్లీ శాఖల నాయకత్వంలో శుక్రవారంనాడు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద నిరసన ధర్నా జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, రామకృష్ణ పాండా, సీపీఐ పార్లమెంటు సభ్యుడు సంతోశ్‌కుమార్ మణిపూర్ సీపీఐ నాయకులు థోరెన్, సింఘాజిత్, జాయ్‌కుమార్, ఢిల్లీ సీపీఐ కార్యదర్శి […]

BJP
విధాత: మణిపూర్‌లో చెలరేగుతున్న హింసాకాండకు అధికార బీజే ప్రభుత్వ చిల్లర రాజకీయాలే కారణమని సీపీఐ ఆరోపించింది. మణిపూర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుక్కోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండు చేశారు. సీపీఐ మణిపూర్, ఢిల్లీ శాఖల నాయకత్వంలో శుక్రవారంనాడు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద నిరసన ధర్నా జరిగింది.
సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, రామకృష్ణ పాండా, సీపీఐ పార్లమెంటు సభ్యుడు సంతోశ్‌కుమార్ మణిపూర్ సీపీఐ నాయకులు థోరెన్, సింఘాజిత్, జాయ్‌కుమార్, ఢిల్లీ సీపీఐ కార్యదర్శి ప్రొఫెసర్‌ఖ దినేశ్ వార్ష్నే, తదితరులు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు.
మణిపూర్‌లో హింసాకాండకు తక్షణం ముగింపుపలికి శాంతిని నెలకొల్పాలని వారు కోరారు. మణిపూర్ సమస్యపై తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు. మణిపూర్ ప్రస్తుత పరిస్థితికి బీజేపీ విభిజించు పాలించు విధానాలు కారణమని వక్తలు విమర్శించారు.