BJP Plan On Medak । ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇదీ బీజేపీ ప్లాన్..
సంగారెడ్డి లో 12న మేధావులతో అమిత్ షా భేటీ! ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజక వర్గాల్లో ప్రభావం చూపాలని యత్నాలు BJP Plan On Medak । సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్‌పై (Medak) బీజేపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారని చెబుతున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చేయడానికి ప్రతి నియోజక వర్గంలో పాలక్‌తోపాటు నియోజక వర్గ ఇన్‌చార్జి, కన్వీనర్, విస్తారక్‌లను నియమిస్తున్నారు. ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, […]

- సంగారెడ్డి లో 12న మేధావులతో అమిత్ షా భేటీ!
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజక వర్గాల్లో
- ప్రభావం చూపాలని యత్నాలు
BJP Plan On Medak । సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్‌పై (Medak) బీజేపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారని చెబుతున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చేయడానికి ప్రతి నియోజక వర్గంలో పాలక్‌తోపాటు నియోజక వర్గ ఇన్‌చార్జి, కన్వీనర్, విస్తారక్‌లను నియమిస్తున్నారు. ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు ఆయా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి గట్టి నాయకులను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
విధాత, ఉమ్మడి మెదక్ ప్రతినిధి: తెలంగాణలో ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీ (Assembly Elections) ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని బీజేపీ (BJP) నేతలు పక్కా వ్యూహం రచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తరువాత నంబర్ 2గా చెప్పే కేంద్ర మంత్రి అమిత్‌షా (Amith Sha)తెలంగాణ (Telangana) బాధ్యతలను భుజాన వేసుకున్నారని చెబుతున్నారు. ప్రత్యేకించి మెదక్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే 12న జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన మేధావులతో అమిత్‌షా సమావేశం కానున్నారని తెలుస్తున్నది.
గజ్వేల్, మెదక్, నర్సాపూర్ బాధ్యతలు ఈటలకు?
జిల్లా లోని గజ్వేల్, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యత పార్టీలో ముఖ్యనేత ఈటల రాజేందర్ (Eetala Rajender)కు అప్పగించినట్టు తెలుస్తున్నది. కేసీఆర్‌పై ఈటల పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉన్నది. మెదక్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, గజ్వేల్‌కు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, నర్సాపూర్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా సీనియర్ నేత పెద్దోళ్ల గంగారెడ్డిని నియమించినట్టు సమాచారం.
పటాన్ చెరువు నియోజకవర్గానికి సీనియర్ నేత, జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావును నియమించారు. దుబ్బాక నియోజక వర్గానికి అంజిరెడ్డి, సిద్దిపేటకు మురళీధర్ దేశ్ పాండే, సంగారెడ్డికి కొంపల్లి మోహన్ రెడ్డి, నారాయణ్‌ఖేడ్‌కు ప్రకాష్ రెడ్డి, జహీరాబాద్‌కు సుగుణాకర్‌రావులను పార్టీ నియమించింది. నారాయణఖేడ్ నుంచి గతంలో విజయపాల్‌రెడ్డి విజయం సాధించగా మరోసారి ఆయననే బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. టికెట్ రేసులో సంగప్ప కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గెలుపుపై బీజేపీలో నమ్మకం
తెలంగాణలో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయనేది బీజేపీ నేతల భావన. గట్టిగా పనిచేస్తే 90 నియోజకవర్గాల్లో (Assembly Constituencies) గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికార పార్టీ బలాలు ఏమిటి? మైనస్‌లు ఏమిటి? అనే అంశాలపై దృష్టిపెట్టి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. నాయకులు ఏమి చెబుతున్నా.. తెలంగాణలో గెలుపు అంత ఈజీ ఏమీ కాదని పరిశీలకులు అంటున్నారు.
అభ్యర్థుల ఎంపికపై అమిత్‌షా చర్చలు?
బీజేపీ తరఫున బరిలో నిలపాల్సిన అభ్యర్థుల (Party Candidates) విషయంలో అమిత్‌షా ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మతం, కులం అంశాలతోపాటు.. నియోజకవర్గాల్లో స్థానిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం.
ప్లాష్
అమిత్ షా సంగారెడ్డి పర్యటన వాయిదా!
మెదక్ ఉమ్మడి జిల్లా సంగారెడ్డి కేంద్రంగా ఈ నెల 12న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అధ్వర్యంలో నిర్వహించనున్న బీజేపీ మేధావుల సమావేశం వాయిదా పడింది. సంగారెడ్డి పర్యటన రద్దయినట్లు బీజేపి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 11న మాత్రం అమిత్ షా హైదరాబాద్ పర్యటన యదావిధిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. 12న కర్ణాటక రాష్ట్ర పర్యటన ఉన్నందున సంగారెడ్డిలో అమిత్ షా పర్యటన వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 11న అమిత్ షా హైదరాబాద్ పర్యటన, సంగారెడ్డి మేధావుల సమావేశం రద్దు తదితర వివరాలు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి సాయంత్రంలోపు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుల ద్వారా తెలిసింది.