అధికారమే లక్ష్యం: వ్యూహత్మకంగా BJP అడుగులు
ఉన్నమాట: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం వ్యూహ రచన చేస్తున్నది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా, విరివిగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నాటికి వివిధ బలమైన నేతలను పార్టీలోకి రప్పించాలన్నది బీజేపీ అధిష్ఠాన పెద్దల ఆలోచన. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన కమలనాథులు ఈసారి తొమ్మిది వరకు గెలవాలని రాష్ట్ర నాయకత్వానికి సూచన చేశారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, కేంద్ర […]

ఉన్నమాట: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం వ్యూహ రచన చేస్తున్నది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా, విరివిగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నాటికి వివిధ బలమైన నేతలను పార్టీలోకి రప్పించాలన్నది బీజేపీ అధిష్ఠాన పెద్దల ఆలోచన.
గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన కమలనాథులు ఈసారి తొమ్మిది వరకు గెలవాలని రాష్ట్ర నాయకత్వానికి సూచన చేశారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలను ఆదేశించారు.
అలాగే పార్టీలోకి సినిమా స్టార్లను, క్రికెట్, ఇతర క్రీడాకారులను ఆహ్వానించి అవసరమైతే వారిని పోటీచేయించే యోచన చేస్తున్నారని సమాచారం. అమిత్ షా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మిథాలీరాజ్, పుల్లెల గోపీచంద్ వంటి వారితో భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో వారి సేవలను ఉపయోగించుకోవచ్చని అంటున్నారు.
అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో యాక్టివ్‌గా ఉన్న వారిని, ఉద్యమంలో పాల్గొని ఏ పదవులు దక్కని అసంతృప్తులపై దృష్టి సారించింది. వారితో జాతీయ నేతలే నేరుగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేదని అలసత్వం పనికిరాదని, గట్టిగా కృషి చేస్తే గట్టెక్కవచ్చని సూచనలు చేస్తూనే నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారట. సీనియర్ నేతలు బాధ్యత తీసుకుని కొత్త, పాత వారితో కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది బహిరంగంగా ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయవద్దని, మీడియా ముందు అసలు ఈ అంశం గురించి మాట్లాడవద్దని నేతలకు గట్టిగానే చెప్పారట. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది, ఎవరు ఎక్కడ పని చేయాలన్నది, ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నది బీజేపీ పెద్దలు చూసుకుంటారని కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది.
కాబట్టి ఎన్నికల నాటికి నేతల మధ్య విభేదాలు ఉంటే పరిష్కరించుకుని కలిసి సాగాల్సిందేనని, అలా కాకుండా ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారట. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పారట. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాల బట్టి మరిన్ని చేరికలు ఆ పార్టీలో ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు.