గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం.. కాంగ్రెస్‌కు దక్కని ప్రతిపక్షహోదా
విధాత: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఏడవసారి విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో సహా ఆప్ పార్టీని మట్టి కరిపించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడ దక్కలేదు. కేవలం 16 సీట్లతోనే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 182 నియోజవర్గాలు iన్న గుజరాత్‌లో బీజేపీ157 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 16 సీట్లలోనే గెలిచింది. బీజేపీ ప్రధాన పోటీదారుగా ప్రచారంలోకి వచ్చిన ఆప్ కేవలం 5 సీట్లకే పరిమితమైంది. కాగా నాలుగు […]

విధాత: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఏడవసారి విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో సహా ఆప్ పార్టీని మట్టి కరిపించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడ దక్కలేదు. కేవలం 16 సీట్లతోనే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
182 నియోజవర్గాలు iన్న గుజరాత్‌లో బీజేపీ157 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 16 సీట్లలోనే గెలిచింది. బీజేపీ ప్రధాన పోటీదారుగా ప్రచారంలోకి వచ్చిన ఆప్ కేవలం 5 సీట్లకే పరిమితమైంది.
కాగా నాలుగు సీట్లలో ఇతరులు గెలుపొందారు. బీజేపీని ఊడుస్తుందనుకున్న చీపురు.. పూర్తిగా చతికల పడింది. ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు గుజరాత్‌లో బీజేపీని గెలిపించుకోవడం ద్వారా పార్టీపై మరింత పట్టు సాధించుకున్నారు.
అదేవిధఃగా బీజేపీ నుంచి పోటీ చేసిన ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివభ జడేజా 15వేల మెజార్టీతో విజయం సాధించింది, అలాగే హర్దిక్ పటేల్ బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇయనకు ఈ సారి క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నది..