లంచం ఇచ్చిన వారితో.. నాకు ప్రాణహాని ఉంది: ఎమ్మెల్యే

విధాత: ఢిల్లీ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే తనకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని వేడుకొన్న స్థితి ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒక ఎమ్యెల్యేకు లంచం ఇవ్వటమే గాక, బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ కాంట్రాక్టర్‌ బెదిరింపులకు దిగిన వైనం అందోళన కరం. ఒక ప్రజా ప్రతినిధికే ఈ పరిస్థితి ఎదురైతే, సాధారణ పౌరుల దుస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. ఢిల్లీ, రోహిణి జిల్లా డాక్టర్‌ అంబేద్కర్‌ ఏరియా ఆస్పత్రిలో తాత్కాలిక సిబ్బంధి నియామకాల్లో అనేక […]

  • By: krs    latest    Jan 18, 2023 1:12 PM IST
లంచం ఇచ్చిన వారితో.. నాకు ప్రాణహాని ఉంది: ఎమ్మెల్యే

విధాత: ఢిల్లీ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే తనకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని వేడుకొన్న స్థితి ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒక ఎమ్యెల్యేకు లంచం ఇవ్వటమే గాక, బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ కాంట్రాక్టర్‌ బెదిరింపులకు దిగిన వైనం అందోళన కరం. ఒక ప్రజా ప్రతినిధికే ఈ పరిస్థితి ఎదురైతే, సాధారణ పౌరుల దుస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.

ఢిల్లీ, రోహిణి జిల్లా డాక్టర్‌ అంబేద్కర్‌ ఏరియా ఆస్పత్రిలో తాత్కాలిక సిబ్బంధి నియామకాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే మహేందర్‌ గోయల్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ఆ దవాఖానలో నియామకాలను ఓ ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు. దాంతో ఆయన ఉద్యోగానికి ఇంత అని డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలిసింది. దాంతో ఆయన చీఫ్‌ సెక్రకటరీ, డీసీపీ, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తదితరులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్‌ ఆప్‌ ఎమ్మెల్యే మహేందర్‌ గోయల్‌ తో డీల్‌ కుదుర్చుకునేందుకు డబ్బులు ముట్టజెప్పాడు. ఆ డబ్బులు ఇవేనని ఎమ్యెల్యే గోయల్‌ తన వెంట తెచ్చిన బ్యాగులోంచి నోట్ల కట్టలు తీసి అసెంబ్లీలో చూపించారు. దీంతో తనకు ప్రాణ హాని ఉన్నదని తెలియజేసి, రక్షణ కల్పించాలని కోరారు.

ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన చోటు చేసుకున్న ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో సంచలనాత్మకం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వ అండతో ప్రైవేటు శక్తులు ఎంతగా పెట్రేగి పోతున్నాయో ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.