Warangal | BRS ప్లీనరీలో ఆకర్షణగా అప్పాల బాక్సు.. విందుభోజనానికి అదనపు హంగు
Warangal, BRS ఆడబిడ్డగా శ్రేణులకు అందించిన MP కవిత విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గ BRS ప్లీనరీలో విందు భోజనానికి తోడు హాజరైన కార్యకర్తలందరికీ మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత ఓ..స్పెషల్ గిప్ట్ కూడా అందించారు. రకరకాల పిండివంటలతో నింపిన బాక్స్ అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఫొటోలతో పాటు తన ఫొటో కూడా ఉన్న మూడు వేల […]

Warangal, BRS
- ఆడబిడ్డగా శ్రేణులకు అందించిన MP కవిత
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గ BRS ప్లీనరీలో విందు భోజనానికి తోడు హాజరైన కార్యకర్తలందరికీ మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత ఓ..స్పెషల్ గిప్ట్ కూడా అందించారు.
రకరకాల పిండివంటలతో నింపిన బాక్స్ అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఫొటోలతో పాటు తన ఫొటో కూడా ఉన్న మూడు వేల అప్పాల బాక్స్ లను మహబూబాబాద్‌లో అందజేశారు.
డోర్నకల్‌లో..
డోర్నకల్ నియోజకవర్గ ప్లీనరీ మరిపెడలో జరగగా అక్కడకూడా.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు, నియోజకవర్గ నాయకులు డిఎస్ రవిచంద్ర ఫోటోలతో పాటు తన ఫోటోలను ముద్రించిన నాలుగు వేల అప్పాల బాక్స్ లను ఎంపీ కవిత ప్రత్యేక కానుకగా అందించారు.
సాధారణంగా పండుగకు పిండివంటలు చేసుకుని.. బంధువులందరికీ పెడతామని.. బీఆర్ఎస్ ఆవిర్భావ పండుగ సందర్భంగా ప్లీనరీకి వచ్చిన పార్టీ బంధువులందరికీ ఓ.. ఆడబిడ్డగా ఈ బాక్స్ అందించానని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లాఅధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మానుకోట జిల్లాలోని రెండు నియోజకవర్గాల ప్లీనరీలో ఈ పిండివంటల బాక్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.