BRS | మోడీ విమర్శలపై బీఆర్‌ఎస్ ముప్పేట దాడి.. మంత్రుల ఫైర్‌

BRS విధాత : ప్రధాని నరేంద్రమోడీ వరంగల్ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్నాడంటు, కేసీఆర్ కుటుంబ అవినీతి ఢిల్లీని కూడా తాకిందంటు తీవ్ర విమర్శలు చేయడం పట్ల రాష్ట్ర బీఆర్‌ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడి కౌంటర్ అటాక్‌తో హోరెత్తించారు. తెలంగాణపై మోడీది కపట ప్రేమని, తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులివ్వకుండా తెలంగాణ రాష్ట్ర పురోగతకి అడ్డం పడుతున్నారంటు మంత్రులంతా ప్రధాని మోడీపై ప్రతి విమర్శలతో కౌంటర్ వేశారు. ప్రధాని హోదాలో ఉండి […]

BRS | మోడీ విమర్శలపై బీఆర్‌ఎస్ ముప్పేట దాడి.. మంత్రుల ఫైర్‌

BRS

విధాత : ప్రధాని నరేంద్రమోడీ వరంగల్ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్నాడంటు, కేసీఆర్ కుటుంబ అవినీతి ఢిల్లీని కూడా తాకిందంటు తీవ్ర విమర్శలు చేయడం పట్ల రాష్ట్ర బీఆర్‌ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడి కౌంటర్ అటాక్‌తో హోరెత్తించారు.

తెలంగాణపై మోడీది కపట ప్రేమని, తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులివ్వకుండా తెలంగాణ రాష్ట్ర పురోగతకి అడ్డం పడుతున్నారంటు మంత్రులంతా ప్రధాని మోడీపై ప్రతి విమర్శలతో కౌంటర్ వేశారు. ప్రధాని హోదాలో ఉండి మోడీ బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వెంపర్లాడుతు సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలతో విమర్శలు చేసి ప్రధాని హోదాను దిగజార్చారంటు ఫైర్ అయ్యారు.

సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయన్న మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రులు మోడీని విమర్శిస్తే ఈడీ, సీబీఐలు వస్తాయంటు ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వమే ఆదాీనీ కోసం దేశ సంపదకు గండికొడుతు అవినీతికి పాల్పడుతుందంటు ధ్వజమెత్తారు.

మోడీ ప్రసంగం.. ఆత్మ వంచన.. పరనింద: కేటీఆర్‌

ప్రధాని మోడీ వరంగల్ సభ ప్రసంగం ఆత్మ వంచన..పరనిందను తలపించిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోడీ కుటుంబ, అవినీతి పాలన పై మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ నాయకుల వారసులు, కుటుంబ సభ్యులు మంత్రులుగా ఉన్న సంగతి మోడీ మరిచారన్నారు.

దేశ రైతుల రుణమాఫీకి చేతులు రాని మోడీకి తన మిత్రుల కోసం లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చేయలేదని, నల్లచట్టాలతో 700మంది రైతుల ప్రాణాలు బలిగొన్నాడన్నారు కేంద్ర ప్రభుత్వంలో 16లక్షల ఖాళీలు భర్తీ చేయలేని మోడీ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

ఉద్యోగాలు అడిగితే మోడీ పకోడీలు వేసుకోమన్నారంటు ఎద్దేవా చేశారు. యూనివర్సిటీ ఖాళీలపై మాట్లాడిన ప్రధాని గవర్నర్‌కు సంబంధిత బిల్లు ఆమోదంపై ఒక మాట చెబితే బాగుండేదన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ హామీలపై తెలంగాణ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలన్నారు.

నీతి అయోగ్ చెప్పిన నిధులివ్వలేదు: హరీష్‌రావు

తెలంగాణకు చాల నిధులిచ్చామని ప్రధాని హోదాలో ఉండి మోడీ వరంగల్ సభలో అసత్య ప్రచారాలు చేశారని మంత్రి టి.హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులే ఇవ్వలేదని, నీతి అయోగ్ చెప్పిన తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులివ్వలేదని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు 21వేల కోట్లను ఆపివేశారన్నారు.

గుజరాత్‌కు లడ్డూ, తెలంగాణకు పిప్పర్‌మెంట్ లాగా మోడీ నిధుల కేటాయింపులు ఉన్నాయంటు చురకలేశారు. మోడీని విమర్శిస్తే ఈడీలు వస్తాయని, వారికి ఈడీలు, సీబీఐలు ఉంటే మాకు ప్రజలున్నారన్నారు. తెలంగాణ పథకాలను కాపి కొట్టిన మోడీ తెలంగాణ పురోగతిపై కళ్ల మంట పెట్టుకుంటున్నాడన్నారు.

కేసీఆర్ పాలన బాగుంటేనే కదా కేంద్రం నుండి రాష్ట్రానికి అవార్డులు దక్కుతున్నాయన్నారు. మోడీకి తెలంగాణపై ప్రేమ ఉంటు విభజన హామీల మేరకు గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలన్నారు.

తెలంగాణ ప్రజలు మోడీ అబద్ధాలు నమ్మరు: మంత్రి జి.జగదీష్‌రెడ్డి

సీఎం కేసీఆర్ కుటుంబంపైన ప్రధాని మోడీ వరంగల్ సభా వేదికగా చేసిన అబద్దపు ప్రచారాలను చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు నమ్మబోరని మంత్రి జి.జగదీష్‌రెడ్డి మోడీ విమర్శలను ఖండించారు. గుజరాత్‌, కర్ణాటకలలో జరిగిన అవినీతి, రాఫెల్, ఆదానీ కుంబకోణం వంటి అవినీతి బయపడకుండా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడన్నారు.

బ్యాంకులకు టొకరా పెట్టిన తన కొద్ధి మంది బడా దోస్తుల కోసం దేశ సంపదను తాకట్టుపెట్టిన ఘనుడు మోడీ అంటు విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందున్న తెలంగాణ ప్రగతిని మోడీ ఒర్వలేకపోతున్నాడన్నారు. దేశానికి రాహుల్‌గాంధీ, మోడీలు ఇద్దరు తోడు దొంగలేనన్నారు.

భద్రకాళీ శాపం తగులుతుంది: వినయ్ భాస్కర్

వరంగల్ సభలో ప్రధాని మోడీ అమ్మవారు భధ్రకాళీ పేరు తీసుకుని కేసీఆర్ పాలనపై అపవిత్ర, అసత్య విమర్శలు చేశారని అందుకు ఆయనకు భధ్రకాళీ శాపం తగులుతుందని ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. మోడీ పర్యటన నిరాశ పరిచిందని, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ప్రకటన చేయకపోవడం నిరాశపరిచిందన్నారు. 520కోట్లతో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్‌కు 20వేల కోట్ల కోచ్ ఫ్యాక్టరీ తరలించుకుపోయారంటు ఆరోపించారు.

మోడీనే అవినీతికి ఆధ్యుడు: గుత్తా

సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రధాని మోడీనే అవినీతికి ఆధ్యుడని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదానీ అవినీతిలో మోడీ హస్తం ఉందని, ఆయన సన్నిహితులకు 12లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పురోగమిస్తుంటే దేశం మోడీ పాలనలో తిరోగమిస్తుందన్నారు. విభజన హామీలను అమలు చేయని మోడీ తెలంగాణకు ఎన్నో చేశామంటు ప్రధాని హోదాకు దిగజారీ అసత్యాలు మాట్లాడటం దారుణమన్నారు.

తెలంగాణపై విషం కక్కిన మోడీ: శ్రీనివాస్‌గౌడ్‌

వరంగల్ సభలో తెలంగాణపై ప్రధాని మోడీ అసత్యాలతో విషం కక్కారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు మోడీ అన్యాయం చేసిన సంగతి ప్రజలు మరువబోరన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై నోరుపారేసుకున్న మోడీ ఆయన పార్టీ ప్రభుత్వాల అవినీతిని విస్మరించారన్నారు. అటు మంత్రి సత్యవతి రాథోడ్ సైతం ప్రధాని నరేంద్రమోడీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఖండించారు