kavitha: బీఆర్ఎస్.. బీజేపీ విలీనం నిజమేనా… కాషాయపార్టీ నేత ఏం చెబుతున్నారు..

kavitha: బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నదని.. అందుకు తాను అడ్డం ఉన్నాననే దూరం పెడుతున్నారంటూ కవిత చేసిన కామెంట్లు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. కవిత కామెంట్లపై తనదైన రీతిలో స్పందించారు.
అసలు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాబోతున్నదని వ్యాఖ్యానించారు. కవిత ఇంతకాలం అంతరంగిక సమావేశాల్లో తన అసంతృప్తిని వెళ్లగక్కారని.. తాజాగా ఆమె బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పయనిస్తున్నదని.. అందులో మంచి నేతలు ఎవరైనా ఉంటే బీజేపీలో చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కవిత కాంగ్రెస్ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నదంటూ విమర్శించారు.
కవిత ప్రసంగం మొత్తం ఉంటే ఆమె కేటీఆర్ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నారన్నదని క్లియర్ అయ్యిందని పేర్కొన్నారు. ఇతర పార్టీలను విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో పదవులు మొత్తం కేటీఆర్ కే ఇస్తున్నారని.. ఆస్తులు కూడా ఆయన తీసుకుంటున్నారన్న ఆవేదన కవితలో ఉందని వ్యాఖ్యానించారు.
తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నదని.. ఇందుకు కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవిత అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. కవిత చేస్తున్న ఆరోపణతో బీఆర్ఎస్ ఇమేజ్ రోజురోజుకు పడిపోతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాలుగు స్థంబాల మధ్య కుప్పకూలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం అవుతున్నదని.. బీజేపీ బలపడుతున్నదని చెప్పుకొచ్చారు.