BRS సభా.. నాకు తెలియదు: బీహార్ సీఎం నితిష్
బీజేపీయేతర పక్షాల్లో ఆదిలోనే అపశతులా..! విధాత: బీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా హాజరవుతారని అందరూ ఊహించారు. మొదటి నుంచీ సీఎం కేసీఆర్‌తో స్నేహపూర్వకంగా ఉంటున్న బిహార్ సీఎం నితీష్‌కుమార్ బీఆర్‌ఎస్ సభకు హాజరు కాకపోవటం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది. బీజేపీయేతర పక్షాలను ఏకతాటి పైకి తెచ్చే బాధ్యతను భుజాన వేసుకున్న కేసీఆర్ ఆది నుంచీ నితీష్ కుమార్‌తో టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు కలిసి జాతీయ […]

బీజేపీయేతర పక్షాల్లో ఆదిలోనే అపశతులా..!
విధాత: బీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా హాజరవుతారని అందరూ ఊహించారు. మొదటి నుంచీ సీఎం కేసీఆర్‌తో స్నేహపూర్వకంగా ఉంటున్న బిహార్ సీఎం నితీష్‌కుమార్ బీఆర్‌ఎస్ సభకు హాజరు కాకపోవటం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది.
బీజేపీయేతర పక్షాలను ఏకతాటి పైకి తెచ్చే బాధ్యతను భుజాన వేసుకున్న కేసీఆర్ ఆది నుంచీ నితీష్ కుమార్‌తో టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు కలిసి జాతీయ రాజకీయాలను చర్చించారు. బీజేపీయేతర పక్షాల ఐక్యత సాధ్యాసాధ్యాలను సమీక్షించారు.
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపొంది భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్బంలో కేరళ, ఢిల్లీ, పంజాబ్, యూపీ మాజీ ముఖ్యమంత్రులు, సీపీఐ నేత డీ.రాజా లాంటి వారు హాజరవగా నితీష్‌కుమార్ హాజరు కాకపోవటం గమనార్హం.
ఈ నేపథ్యంలోంచే.. బీఆర్‌ఎస్ సభకు గైర్హాజర్‌పై ఓ మీడియా అడిగిన ప్రశ్నకు.. నాకు తెలియదనీ, నేను ఆ సమయంలో మరో పనిలో తీరిక లేకుండా ఉన్నానని ఆయన అనటం గమనించదగినది.
దీన్ని బట్టి ఆయనకు ఆహ్వానం ఉన్నదా? లేదా..? నిజంగానే పని ఒత్తిడి మూలంగానే హాజరు కాలేక పోయారా? అప్పుడే ఏమైనా వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు ఏమైనా వచ్చాయా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది. ఏదేమైనా బీజేపీయేతర పక్షాలు ఏకతాటి పైకి రావాల్సి ఉన్న సమయంలో ఆదిలోనే అపశృతులు అన్నట్లు ఈపరిణామాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.