నేటి నుంచి BSP 2వ విడత బహుజన రాజ్యాధికార యాత్ర
మునుగోడులో బహిరంగ సభ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విధాత,హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడత మునుగోడు నియోజకవర్గంలో నేటి నుంచిప్రారంభం కానుంది. నేటి ఉదయం 10గంటలకు హైదరాబాద్ ఎల్.బి నగర్ చింతల్ కుంట నుంచి ర్యాలీ ప్రారంభమై, 12 గంటలకు చౌటుప్పల్‌లోని ఆందోల్ మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం నారాయణపూర్, […]

మునుగోడులో బహిరంగ సభ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
విధాత,హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడత మునుగోడు నియోజకవర్గంలో నేటి నుంచి
ప్రారంభం కానుంది.
నేటి ఉదయం 10గంటలకు హైదరాబాద్ ఎల్.బి నగర్ చింతల్ కుంట నుంచి ర్యాలీ ప్రారంభమై, 12 గంటలకు చౌటుప్పల్‌లోని ఆందోల్ మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పించనున్నారు.
అనంతరం నారాయణపూర్, మునుగోడులలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సత్య ఫంక్షన్‌హాల్‌కు భారీ ర్యాలీగా చేరుకుని బహిరంగ సభ నిర్వహించనున్నారు. బుధవారం నుంచి మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో యాత్ర కొనసాగుతుందని బీఎస్పీ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.