సందేశాత్మక సాహిత్యంతో భావి సమాజాన్ని నిర్మించాలి: ఏకె ఖాన్

దోమకొండ కోటలో ఉర్దూ సాహిత్యంపై కవి సమ్మేళనం విధాత, నిజామాబాద్ : చారిత్రక సాహిత్య సంపద, అందులోని సందేశాన్ని భావి భావి తరాలకు అందజేయాలని ప్రభుత్వ సలహాదారుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకె ఖాన్ అన్నారు. తద్వారా నూతన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. దోమకొండ సంస్థనాదీషుడు అనిల్ కామినేని ఆధ్వర్యంలో కోటలో శనివారం ఉర్దూ ముషాయిరా ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రక వారసత్వ కట్టడాలు, సాహిత్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా […]

సందేశాత్మక సాహిత్యంతో భావి సమాజాన్ని నిర్మించాలి: ఏకె ఖాన్
  • దోమకొండ కోటలో ఉర్దూ సాహిత్యంపై కవి సమ్మేళనం

విధాత, నిజామాబాద్ : చారిత్రక సాహిత్య సంపద, అందులోని సందేశాన్ని భావి భావి తరాలకు అందజేయాలని ప్రభుత్వ సలహాదారుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకె ఖాన్ అన్నారు. తద్వారా నూతన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. దోమకొండ సంస్థనాదీషుడు అనిల్ కామినేని ఆధ్వర్యంలో కోటలో శనివారం ఉర్దూ ముషాయిరా ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రక వారసత్వ కట్టడాలు, సాహిత్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ముఖ్యంగా సాహిత్యంలోని సమాజ శ్రేయస్సు కోసం చేసిన కవితలు, రచనలు భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భాషకు మతం, కులం లేదన్నారు. దోమకొండ సంస్థాన కట్టడాలను యునెస్కో గుర్తించిందనలన్నారు. అదే విధంగా సంస్థనాదీషుల్లో ముక్యుడైన రాజేశ్వర్ రావు అజ్గర్ ఉర్దూ సాహిత్యానికి చేసిన సేవలను ఖాన్ కొనియాడారు. ఊర్డు, పార్సి, సంస్కృతం, తెలుగు భాషలలో 125 రచనలు చేశారన్నారు. భాషలకు మతాలను ముడిపెట్టవద్దని కోరారు. ప్రభత్వం తరపున పురాతన ఉర్దూ సాహిత్యానికి సంబంధించిన రచనలను ముదరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ లో 5 లక్షల పురాతన ఉర్దూ డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటిని వెలికి తీసి ముద్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఉర్దూ భాషలో వున్న పుస్తకాలను డిజిటలైజ్ చేయించేందుకు కృషి చేస్తానని, ఉర్దూ భాషా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను తెలంగాణ రాష్ట్రంలోని 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉంచుతామన్నారు.

సమావేశంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉర్దూ నేర్చుకునేందుకు అవకాశం లభించిందన్నారు. కలెక్టర్ తన ప్రసంగాన్ని ఉర్దూలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిల్ కామినేని మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన పూర్వీకులు సాహిత్యంపై చేసిన సేవలను గుర్తు చేసుకొని కంట తడి పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో దోమకొండ సంస్థనాదీషులు రాజారాజేశ్వర్ రావు కామినేని, సతీష్ కామినేని, సిర్నాపల్లి దొరసాని అనురాధ, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఉర్దూ కవులు సజ్జాద్ షాహెద్, ప్రొఫెసర్లు మజీద్ బెదార్, నసీరొద్దీన్ ఫరీజ్, దానిష్ మొయిన్, వొదేశ్ రాణి, శాఖత్ హయత్, నాజిమ్ అలీ, మోహిద్ జావీద్, నాజిమోద్దీన్ మునవర్, ముస్తాక్ అహ్మద్ తదితరులు ముషయిరా (కవి సమ్మేళనం)లో పాల్గొన్నారు. భారతం, రామాయణం, భాగవతం వంటి పురాణ గాథల ఔన్నత్యంపై ఊర్డులో చదివిన కవితలు వినిపించారు. అనంతరం కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు, గజల్ కార్యక్రమం నిర్వహించారు