వరంగల్‌: భగ్గుమన్న కాంగ్రెస్.. CM KCR దిష్టిబొమ్మ దహ‌నం

విధాత, వరంగల్: కాంగ్రెస్ వార్ రూమ్ పైన దాడిని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. హన్మకొండ, మహబూబాబాద్ సెంటర్లలో పెద్దఎత్తున ధ‌ర్నాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహ‌నం చేశారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య‌క్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలో ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయం పై పోలీసుల దాడి, సీజ్ […]

వరంగల్‌: భగ్గుమన్న కాంగ్రెస్.. CM KCR దిష్టిబొమ్మ దహ‌నం

విధాత, వరంగల్: కాంగ్రెస్ వార్ రూమ్ పైన దాడిని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. హన్మకొండ, మహబూబాబాద్ సెంటర్లలో పెద్దఎత్తున ధ‌ర్నాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహ‌నం చేశారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య‌క్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలో ధర్నానిర్వహించారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయం పై పోలీసుల దాడి, సీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం అని ధ్వ‌జ‌మెత్తారు.

ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోమని ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురి కాక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, కార్పొరేట‌ర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, గ్రేటర్ వరంగల్ మైనారిటీ కాంగ్రెస్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా INTUC చైర్మన్ కూర వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, జిల్లా NSUI అధ్య‌క్షుడు పల్లకొండ సతీష్, మాజీ కార్పొరేటర్ నసీం జహాన్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, టీపీసీసీసోషల్ మీడియా కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహాల్, కేతిడి దీపక్ రెడ్డి, మహమ్మద్ అంకుష్, తోట పవన్, నల్ల సత్యనారాయణ, నాగపురి లలిత, ఆర్షం అశోక్, బొంత సారంగం, గుంటి స్వప్న, ఎర్ర మహేందర్, తాళ్ళపల్లి మేరీ త‌దిత‌రులు పాల్గొన్నారు.