Nara Lokesh | వాస్తవాలు చెప్పేందుకే డిల్లీ వచ్చా: నారా లోకేశ్
Nara Lokesh | విధాత: ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రాబాబునాయుడును అక్రమ కేసులలో అరెస్టు చేసి జైలు పెట్టడంపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే తాను ఢిల్లీకి వచ్చానని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అక్రమాలపై పోరాడే పార్టీలన్ని టీడీపీ, జనసేనతో కలిసిరావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో అన్న సీట్లలో తాము గెలుస్తామన్నారు. చంద్రబాబు అరెస్టు పరిణామాలపై పార్లమెంటులో […]

Nara Lokesh |
విధాత: ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రాబాబునాయుడును అక్రమ కేసులలో అరెస్టు చేసి జైలు పెట్టడంపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే తాను ఢిల్లీకి వచ్చానని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అక్రమాలపై పోరాడే పార్టీలన్ని టీడీపీ, జనసేనతో కలిసిరావాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో అన్న సీట్లలో తాము గెలుస్తామన్నారు. చంద్రబాబు అరెస్టు పరిణామాలపై పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. ఈ మేరకు శనివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు.
చట్టాలను వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే సివిల్ వార్ వస్తుందన్నారు. 14ఏళ్ల పాటు తమ తండ్రి క్లీన్ ఇమేజ్‌తో రాజకీయాల్లో కొనాసుతున్నారని, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దమ్ముంటే సీఎం జగన్ చర్చకు రావాలన్నారు. ఏపీ సీఎం జగన్ అవినీతి కేసులన్ని దేశమంతా తెలుసన్నారు. చంద్రబాబును కేవలం రాజకీయ కక్షతో సీఎం జగన్ జైలులో పెట్టించి ఆనందం పొందుతున్నారన్నారు.