Car accident | నగర శివారులో కారు బీభ‌త్సం.. ఎగిరిపడిన తల్లీ కూతుళ్లు! అక్కడికక్కడే మృతి

Car accident ఎగిరిపడిన తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే ఇద్దరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మార్నింగ్‌ వాక్‌కు వెళ్తుండగా ఘటన కారు న‌డిపిన యువ‌కుడు అరెస్ట్ విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: నగర శివారులో ఓ కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్‌ వాక్‌ కు బయలు దేరిన తల్లి కుతురు ను ఓ కారు మృత్యువు రూపంలో దూసుకువ‌చ్చింది. దీంతో రోడ్డు పక్కన ఎగిరి పడిన ఆ ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొక‌రు తీవ్రగాయలపాలయ్యారు. పోలీసులు […]

Car accident | నగర శివారులో కారు బీభ‌త్సం.. ఎగిరిపడిన తల్లీ కూతుళ్లు! అక్కడికక్కడే మృతి

Car accident

  • ఎగిరిపడిన తల్లీ కూతుళ్లు
  • అక్కడికక్కడే ఇద్దరు మృతి
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • మార్నింగ్‌ వాక్‌కు వెళ్తుండగా ఘటన
  • కారు న‌డిపిన యువ‌కుడు అరెస్ట్

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: నగర శివారులో ఓ కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్‌ వాక్‌ కు బయలు దేరిన తల్లి కుతురు ను ఓ కారు మృత్యువు రూపంలో దూసుకువ‌చ్చింది. దీంతో రోడ్డు పక్కన ఎగిరి పడిన ఆ ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొక‌రు తీవ్రగాయలపాలయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదర్‌షాకోట్‌ లక్ష్మీనర్సింహ కాలనీ ప్రాంతానికి చెందిన అనురాధ (38) అమె కూతురు మమతతో పాటు పక్కింట్లో ఉంటున్న కవిత ముగ్గురు కలిసి రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో వాకింగ్‌కు అని బయలుదేరారు.

వారు రఘురాంనగర్‌ కాలనీ ముందు ఉన్న ఆర్మీ గేటు ముందు నుంచి నడుచుకుంటు వెళ్తుండగా ఓ కారు(ఎపి 09 బిజే 2588) అతి వేగంతో వచ్చి వెనుక నుండి డీ కొట్టింది. దీంతో వారిలో తల్లి అనురాధ, మమత అక్కడిక్కడే మృతి చెందగా కవిత తీవ్ర గాయలపాలైంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను ఉస్మానియ మార్చురికి తరలించారు. గాయాలపాలైన కవితను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడే పడి ఉన్న కారు (నంబ‌ర్ ఏపీ 09 బీజే 2588) ను స్వాదీనం చేసుకున్నారు.

కారు నడిపిన వ్యక్తి అరెస్ట్….

ఇద్ద‌రి మృతికి కార‌ణ‌మైన నిందితుడిని నార్సింగి పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. బ‌ద్రుద్దీన్ అనే యువ‌కుడు త‌న పుట్టిన రోజు వేడుక‌ను జ‌రుపుకునేందుకు మ‌రో ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున మాస‌బ్‌ట్యాంక్ నుంచి మొయినాబాద్ వైపు కారులో బ‌య‌ల్దేరాడు.

స‌న్‌సిటీ వ‌ద్ద‌కు రాగానే కారు అదుపుత‌ప్పి వాకింగ్ చేస్తున్న ముగ్గురు మ‌హిళ‌ల‌ను ఢీకొట్టింది. ఆ త‌ర్వాత మ‌రో వ్య‌క్తిని కూడా కారు ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు మ‌హిళ‌లు(త‌ల్లీబిడ్డ‌) మృతి చెంద‌గా, మ‌రో మ‌హిళ‌, ఇంతియాజ్ అనే వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిద్ద‌రిని ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చేర్పించారు.

ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన బ‌ద్రుద్దీన్ ఓ ప్ర‌యివేటు కాలేజీలో బీబీఏ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.