Uttarakhand | లోయ‌లో ప‌డిన కారు.. ముగ్గురు మృతి

Uttarakhand విధాత‌: ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో అదుపుత‌ప్పి కారు లోతైన లోయలో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రొక‌రు గ‌ల్లంత‌య్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. మంగ‌ళ‌వారం రాత్రి కారులో నలుగురు వ్య‌క్తులు గుమ్‌ఖాల్ మార్కెట్ నుంచి జైహరిఖల్ ప్రాంతంలో ఉన్న దేవదాలీ గ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగుతున్న‌ద‌ని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళ అధికారి ప్రవీణ్ రాఠీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రోప్ […]

  • By: Somu    latest    Aug 09, 2023 12:15 AM IST
Uttarakhand | లోయ‌లో ప‌డిన కారు.. ముగ్గురు మృతి

Uttarakhand

విధాత‌: ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో అదుపుత‌ప్పి కారు లోతైన లోయలో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రొక‌రు గ‌ల్లంత‌య్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. మంగ‌ళ‌వారం రాత్రి కారులో నలుగురు వ్య‌క్తులు గుమ్‌ఖాల్ మార్కెట్ నుంచి జైహరిఖల్ ప్రాంతంలో ఉన్న దేవదాలీ గ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగుతున్న‌ద‌ని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళ అధికారి ప్రవీణ్ రాఠీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రోప్ స్ట్రెచర్ల సాయంతో మూడు మృతదేహాలను వాగు నుంచి ప్రధాన రహదారి పైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.