కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది: గుత్తా

విధాత: రాజ్యాంగ పరమైన వ్యవస్థలను, సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా మిత్రులతో గురువారం నిర్వ‌హించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలపైన కక్ష్య సాధింపు చర్యలను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇది ఫెడరల్ వ్యవస్థకు మంచిది కాదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఐటీ శాఖను ఉపయోగించి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. మొన్న రామగుండంలో ప్రధానమంత్రి మోడీ […]

  • By: krs    latest    Nov 17, 2022 12:38 PM IST
కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది: గుత్తా

విధాత: రాజ్యాంగ పరమైన వ్యవస్థలను, సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా మిత్రులతో గురువారం నిర్వ‌హించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వాలపైన కక్ష్య సాధింపు చర్యలను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇది ఫెడరల్ వ్యవస్థకు మంచిది కాదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఐటీ శాఖను ఉపయోగించి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. మొన్న రామగుండంలో ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరింపు ధోరణితో మాట్లాడారని గుర్తుచేశారు.

ఆయన దేశానికి మొత్తం ప్రధాన మంత్రి కేవలం కొన్ని రాష్టాలపై మమకారం చూపడం కరెక్ట్ కాదని సూచించారు. గుజరాత్‌లో ఆప్ అభ్యర్థిని కిడ్పాస్‌ చేసి పోలీసుల‌ సహకారంతో ఆ అభ్యర్ధితో విత్ డ్రా చేయించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, అధికారాలను లాక్కోవాలి అనే కుట్రపూరిత ఆలోచనలను కేంద్రం మానుకోవాలని హిత‌వు ప‌లికారు.