Visakha Steel Plant | ఓ ఆంధ్ర.. ఓ స్టీల్ ప్లాంట్.. క్రెడిట్ గోస్ టూ KCR
స్టీల్ ప్లాంట్ క్రెడిట్ జమ చేసుకుంటున్న TRS నాయకులు విధాత: మొత్తానికి భారత రాష్ట్ర సమితి(BRS)కి ఓ ఆఫర్ తగిలినట్లు అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)ను ప్రస్తుతానికి ప్రయివేటీకరణ చేసే ఉద్దేశ్యం లేదని, దాన్ని మరింత బలోపేతం చేస్తామని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గాన్ సింగ్ చెప్పడం BRSకు భారీ సంతోషాన్ని ఇచ్చింది. కేవలం తమ దెబ్బతోనే కేంద్రం దిగి వచ్చిందని, తాము సింగరేణి కాలరీస్ తరఫున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని […]

- స్టీల్ ప్లాంట్ క్రెడిట్ జమ చేసుకుంటున్న TRS నాయకులు
విధాత: మొత్తానికి భారత రాష్ట్ర సమితి(BRS)కి ఓ ఆఫర్ తగిలినట్లు అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)ను ప్రస్తుతానికి ప్రయివేటీకరణ చేసే ఉద్దేశ్యం లేదని, దాన్ని మరింత బలోపేతం చేస్తామని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గాన్ సింగ్ చెప్పడం BRSకు భారీ సంతోషాన్ని ఇచ్చింది.
కేవలం తమ దెబ్బతోనే కేంద్రం దిగి వచ్చిందని, తాము సింగరేణి కాలరీస్ తరఫున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని (VISAKHA STEEL PLANT) టేకోవర్ చేసేందుకు ప్రయత్నించగానే కేంద్రం భయపడి పోయింది, అందుకే ఇక ప్రయివేటీకరణ ఆలోచన విరమించుకుంది కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ ప్రకటనలు చేశారు.
వాస్తవానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తాం అని కేంద్రం పలుమార్లు చెబుతూ వస్తోంది. అయితే దాన్ని ఆపాలని ఆంధ్ర సర్కారు సైతం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సైతం ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి ఆ విషయం మాట్లాడారు. అయితే ఈలోపు ఈనెల పదిహేనులోగా స్టీల్ ప్లాంట్‌లో కొంత వాటా విక్రయించే విషయమై ఆసక్తి ఉన్న పార్టీలు తమను సంప్రదించాలని స్టీల్ ప్లాంట్ ఓ ప్రకటన చేసింది.
దీంతో దాదాపు రూ. ఐదు వేల కోట్ల విలువైన వాటాను తాము తీసుకుంటాం అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయడమే కాకుండా సింగరేణి సంస్థ తరఫున కొందరు అధికారులను సైతం స్టీల్ ప్లాంట్ పరిశీలనకు పంపారు.
అయితే అసలు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాలు ఈ స్టీల్ ప్లాంట్‌లో వాటాలు కొనుగోలు చేయడం కుదరదు అంటూ గతంలోనే కేంద్రం ఓ చట్టాన్ని చేసిన విషయం బయట జనాలకు పెద్దగా తెలియక పోవడంతో నిజంగానే సింగరేణి తరఫున తెలంగాణ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ను ఆపరేట్ చేస్తుందేమో అని జనం అనుకున్నారు.
మరి చివరకు కేంద్రంలో ఏమైందో ఏమో కానీ ప్రస్తుతానికి ఆ ప్రైవేటీకరణ ప్రక్రియ ముందుకు వెళ్ళదని, అంతే సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ను మరింత బలోపేతం చేస్తామని ఫగ్గాన్ సింగ్ చెప్పగానే కేటీఆర్, హరీశ్‌రావులు బయటికి వచ్చి మేం అడుగు పెట్టాం, ప్రయివేటీకరణ ఆగిపోయింది కేసీఆర్ అంటే మామూలుగా ఉండదు అంటూ ఏదేదో మాట్లాడారు.
ఇదిలాఉండగా మచిలీపట్టణం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ వాళ్ళు స్టీల్ ప్లాంట్ ను కాపాడడం ఏందీ..? ముందు వాళ్ళ సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ కాకుండా ఆపుకోమనండి చాలు అంటూ సెటైర్లు వేశారు.. మొత్తానికి విశాఖ ఉక్కు రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసినట్లే ఉంది