Chandrababu | లవ్ చేయాలా వద్దా.. NDA నుంచి చంద్రబాబుకు పిలుపు
Chandrababu 18న ఎన్డీయే సభకు చంద్రబాబు విధాత: లవ్ చేయాలా వద్దా.. చంద్రబాబు ప్రస్తుతం ఇలాంటి సందిగ్ధంలో ఉన్నారు. తీవ్ర వ్యతిరేకత ఉన్న బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాలా వద్దా అని డవుట్ పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు. ఇన్నాళ్లుగా ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చిందా.. కోరుకున్నది జరగబోతోందా ?? నన్ను మోడీ లెక్క చేయడం లేదు.. అవమానిస్తున్నారు.. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వగచిన చంద్రబాబుకు ఇప్పుడు నేరుగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 18న […]

Chandrababu
- 18న ఎన్డీయే సభకు చంద్రబాబు
విధాత: లవ్ చేయాలా వద్దా.. చంద్రబాబు ప్రస్తుతం ఇలాంటి సందిగ్ధంలో ఉన్నారు. తీవ్ర వ్యతిరేకత ఉన్న బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాలా వద్దా అని డవుట్ పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు. ఇన్నాళ్లుగా ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చిందా.. కోరుకున్నది జరగబోతోందా ?? నన్ను మోడీ లెక్క చేయడం లేదు.. అవమానిస్తున్నారు.. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వగచిన చంద్రబాబుకు ఇప్పుడు నేరుగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీయే భాగస్వాముల సమావేశానికి రావాలని పిలుపు వచ్చింది.
వాస్తవానికి 2014 లో బీజేపీతో కలసి ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు 2018లో ఎన్డీయే నుంచి బయటికి వచ్చి మళ్ళీ అదే మోడీ.. అదే బీజేపీ మీద తీవ్ర పోరాటం చేశారు. దీంతో 2019లో ఢిల్లీలో మోడీ గెలిచినా ఆంధ్రాలో చంద్రబాబు ఓడిపోయారు. ఇక్కడ జగన్ దెబ్బకు తట్టుకోలేక మళ్ళీ మోదీ పంచన చేరేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. అయినా ఢిల్లీ పెద్దలు కరుణించలేదు.
ఇప్పుడు మళ్ళీ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. గతంలో తమతో కలిసి ఉన్న పార్టీలతోబాటు ఇప్పుడు ఎన్డీయేలో ఉన్న పార్టీలకు పిలుపు చేస్తున్నారు. టీడీపీతోబాటు పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్, ఇంకా బీహార్ నుంచి లోక్ జన శక్తి పార్టీలు గతంలో ఎన్డీయేలో ఉండి ఇప్పుడు బయట ఉన్నాయి. మళ్ళీ ఈ పార్టీలకు పిలుపు వచ్చింది. రానున్న ఎన్నికల్లో తమతో కలిసి రావాలని మోడీ.. ఇతర పెద్దలు కోరుతారని అంటున్నారు.
వాస్తావానికి అప్పట్లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో బరిలోదిగారు.ఈ నేపథ్యంలో మొన్నామధ్య జరిగిన కాంగ్రెస్ భాగస్వాముల సభకు కూడా టీడీపీకి పిలుపు వచ్చింది. కానీ ఆ సభకు చంద్రబాబు వెళ్ళలేదు. ఇప్పుడు ఎన్డీయే సభకు వెళ్తారని అంటున్నారు.. మరోవైపు దేశంలో బిజెపి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది..మొన్న కర్ణాటకలో బిజెపి ఓడిపోయింది. మధ్యప్రదేశ్ లో కూడా పోవచ్చని అంటున్నారు. మరి ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నపుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రాలో మళ్ళీ దెబ్బడిపోతుందని ఓ వైపు ఆలోచన ఉందని అంటున్నారు.