Chandrababu | మోడీ భజనతో బాబుకు డ్యామేజీ.. కోపానికొస్తున్న లెఫ్ట్ పార్టీలు
Chandrababu విధాత: సిట్యువేషన్ను బట్టి అల్లుకు పోవడం అంటారో.. అవకాశవాదం అంటారో.. అతి తెలివి అంటారో.. జనాల ఎర్రితనం మీద ఆయనకు ఉన్న నమ్మకం అనుకుంటారో మీ ఇష్టం కానీ ఈ మధ్య చంద్రబాబు (Chandrababu) మోడీని కీర్తిస్తూ చేసిన కామెంట్స్, ప్రసంగం మరోసారి ఆయన్ను ఇబ్బంది పెట్టేసేలా ఉన్నాయ్. మోడ్ విధ్వంసకర రాజకీయాలకు బుద్ధి చెప్పాలి.. పెళ్ళాన్ని వదిలేసినవాడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడు.. కాంగ్రెస్‌తో కలిసి మోడీ అంతు తేలుస్తాం అంటూ 2019 ఎన్నికల్లో రంకెలేసి […]

Chandrababu
విధాత: సిట్యువేషన్ను బట్టి అల్లుకు పోవడం అంటారో.. అవకాశవాదం అంటారో.. అతి తెలివి అంటారో.. జనాల ఎర్రితనం మీద ఆయనకు ఉన్న నమ్మకం అనుకుంటారో మీ ఇష్టం కానీ ఈ మధ్య చంద్రబాబు (Chandrababu) మోడీని కీర్తిస్తూ చేసిన కామెంట్స్, ప్రసంగం మరోసారి ఆయన్ను ఇబ్బంది పెట్టేసేలా ఉన్నాయ్. మోడ్ విధ్వంసకర రాజకీయాలకు బుద్ధి చెప్పాలి.. పెళ్ళాన్ని వదిలేసినవాడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడు.. కాంగ్రెస్‌తో కలిసి మోడీ అంతు తేలుస్తాం అంటూ 2019 ఎన్నికల్లో రంకెలేసి బోర్లా పడ్డ చంద్రబాబు మళ్లీ ఈమధ్య ట్యూన్ మార్చారు.
మళ్ళీ కేంద్రంలో బిజెపి సారధ్యంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందని సర్వేలు చెబుతుండంతో మళ్ళీ మోడీ భాయ్.. మోడ్ సారధ్యమే దేశనికి అత్యవసరం అని భజన మొదలు పెట్టారు. ఇది ఆయన అవకాశవాదానికి నిదర్శనం అని ఎవరు అనుకున్న కానీ బాబు ఐతే మాత్రం తన కొత్త కాన్సెప్ట్ జై మోడీ, జై bjp కాన్సెప్ట్ కు కట్టుబడి ఉన్నారన్నది సుస్పష్టం.
అయితే ఈ కొత్త పల్లవి చంద్రబాబు (Chandrababu) మిత్రులు, లెఫ్ట్ పార్టీలకు మింగుడుపడడం లేనట్లుంది. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు. సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు వంటి వారు మాట్లాడుతూ ఏవీ పద్దెనిమిది కోట్లా జాబ్స్ ఇస్తామన్న మోడీ ఇచ్చారా.. తెలుగు రాష్ట్రాలకు ఏమైనా చేసారా.? మరి ఏముందని మోడీకి జై అంటున్నారు..
అబివృద్ది కోసం కాదు.. కేవలం ఓ అవకాశవాదం అని, కేవలం మళ్ళీ ఆంధ్రాలో అధికారం చేపట్టేందుకు ఈ మోడీ కీర్తనలు అని అయన విమర్శించారు. శ్రీనివాసరావు ఐతే మోడీని భుజాన మోసేందుకు సిద్ధపడిన చంద్రబాబు అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రైవేటు పరం చేస్తున్న ఎందుకు గమ్మున ఉంటున్నారు.. ప్రశ్నించాలి కదా అని అంటున్నారు. మొత్తానికి మోడీ సపోర్ట్ కోసం చుస్తే టిడిపికి ఇటు లెఫ్ట్ పార్టీలు దూరం అవుతాయా.. ఏమో.. మున్ముందు ఏమవుతుందో చూడాలి.
Chandrababu | మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారు: తెడ్డు మర్లేసిన చంద్రబాబు