RRR అలైన్‌మెంట్ మార్చండి: R&B ఈఎన్సీకి వినతి

విధాత యాదాద్రి భువనగిరి: బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పి.వి.శ్యామ్ సుందర్ రావు ఆధ్వర్యంలో RRR బాధితులు గురువారం నేషనల్ హైవే చీఫ్ ఇంజినీర్ ఐ.గణపతి రెడ్డిని హైదరాబాద్ లోని R&B చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో గారిని కలిసి అలైన్ మెంట్ మార్చాలని వినతిపత్రం సమర్పించారు. రీజినల్ రింగ్ రోడ్డులో భాగంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ మార్చి న్యాయం చేయాలని […]

  • By: krs    latest    Sep 22, 2022 8:44 AM IST
RRR అలైన్‌మెంట్ మార్చండి: R&B ఈఎన్సీకి వినతి

విధాత యాదాద్రి భువనగిరి: బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పి.వి.శ్యామ్ సుందర్ రావు ఆధ్వర్యంలో RRR బాధితులు గురువారం నేషనల్ హైవే చీఫ్ ఇంజినీర్ ఐ.గణపతి రెడ్డిని హైదరాబాద్ లోని R&B చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో గారిని కలిసి అలైన్ మెంట్ మార్చాలని వినతిపత్రం సమర్పించారు.

రీజినల్ రింగ్ రోడ్డులో భాగంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ మార్చి న్యాయం చేయాలని కోరారు.

ఈఎన్సిని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్టెడి నర్సింహా రెడ్డి, కర్నాటి ధనుంజయ్య, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కొండం ఉపేందర్ గౌడ్, RRR నిర్వాసితులు పసుపునూరి నాగ భూషణం, గడ్డమీది మల్లేష్,అవుశెట్టి పాండు తదితరులు పాల్గొన్నారు.