BRS సంబురాలపై ‘చీమలపాడు’ నీడ.. బాణాసంచా లేకుండా ఉత్సవాలు
BRS నేతల ముందు జాగ్రత్త సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ఆదేశం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఈనెల 25న నిర్వహించనున్న గులాబీ పార్టీ నియోజకవర్గస్థాయి సంబరాలపై చీమలపాడు నీడ కనిపిస్తోంది. ప్లీనరీ పేరుతో పకడ్బందీగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చినప్పటికీ బాణాసంచా లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు కేడర్‌కు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. చీమలపాడు విషాద సంఘటన మళ్లీ ఎక్కడ పునరావృతం కాకుండా బాణాసంచాను కాల్చకుండా అవసరమైన […]

- BRS నేతల ముందు జాగ్రత్త
- సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ఆదేశం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఈనెల 25న నిర్వహించనున్న గులాబీ పార్టీ నియోజకవర్గస్థాయి సంబరాలపై చీమలపాడు నీడ కనిపిస్తోంది. ప్లీనరీ పేరుతో పకడ్బందీగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చినప్పటికీ బాణాసంచా లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు కేడర్‌కు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. చీమలపాడు విషాద సంఘటన మళ్లీ ఎక్కడ పునరావృతం కాకుండా బాణాసంచాను కాల్చకుండా అవసరమైన చర్యలు ముందుగానే చేపడుతున్నారు.
కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఇటీవల నిర్వహించిన బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా బాణాసంచా పేలి ఒక గుడిసెకు నిప్పుంటుకున్న విషయం తెలిసిందే. ఆ గుడిసెలోని గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందగా పలువురు క్షతగాత్రులు అయిన విషాద సంఘటన ఇంకా ఎవరూ మరిచిపోలేదు.
తిరిగి ఇలాంటి సంఘటనలకు ఆస్కారం కల్పించకుండా సంబురాలలో బాణాసంచాను లేకుండా చూస్తే సమస్య ఏర్పడదనే ఉద్దేశంతో ఈ మేరకు ముందుగానే సమాచారాన్ని కేడర్కు చేరవేస్తున్నారు. ఈ మేరకు సన్నాహక సమావేశాల్లోనే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇన్చార్జులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో జరిగే సంబురాల సందర్భంగా బాణాసంచా లేకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టంగా ఆదేశించారు. అంటే చీమలపాడు సంఘటన ప్రభావం గులాబీ పార్టీ నేతలను వెంటాడుతోంది.