నిజామాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

విధాత, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌ప‌ల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృత్యువాత పడింది. బుధవారం అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొందని ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి చందన తెలిపారు. దీని వయస్సు మూడేళ్లుంటుందని చెప్పారు. ఈ ప్రమాదంలో చిరుత పులి అక్కడికక్కడే చనిపోయిందని, సమాచారం అందిన వెంటనే తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించమన్నారు. చిరుత కళేబరాన్ని పోస్ట్ మార్టం […]

నిజామాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

విధాత, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌ప‌ల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృత్యువాత పడింది. బుధవారం అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొందని ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి చందన తెలిపారు. దీని వయస్సు మూడేళ్లుంటుందని చెప్పారు.

ఈ ప్రమాదంలో చిరుత పులి అక్కడికక్కడే చనిపోయిందని, సమాచారం అందిన వెంటనే తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించమన్నారు. చిరుత కళేబరాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. ఈ సంఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.